ఫిక్స్‌డ్ డిపాజిట్.. అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు బాగానే ఉంటుంది. అయితే జూలై ఒకటో తేదీ నుంచి కొన్ని బ్యాంకులు తమ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. అన్ని బ్యాంకుల్లో రేట్లు ఒకలా ఉండవు. బ్యాంకులను బట్టి రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న టాప్ నాలుగు బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాంకుల్లో రూ. 3కోట్ల కంటే తక్కువైన మొత్తాలకు జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. వాటిల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ సింధ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు ఎఫ్‌డీలకు వర్తిస్తాయి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిపై సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 7.2% వరకు ఉంటుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు మొత్తాలకు వర్తిస్తాయి. 12 నెలల కాలవ్యవధిలో సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 8.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 12 నెలల కాలవ్యవధిపై 8.25% ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) కొత్త వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి అమలులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు వరకూ వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 15 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య కాలవ్యవధిపై 7.2% వరకు ఉంటుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు 666 రోజులలో అత్యధికంగా 7.80% వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు అదే వ్యవధిలో 7.3% వరకు ఉంటుంది.
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూన్ 30, 2024న సవరించింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. 666 రోజుల వ్యవధిలో సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.80% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు అదే వ్యవధిలో 7.3% వరకు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..