OLA Offers: ఓలా ఎస్‌1 స్కూటర్లపై అదిరే ఆఫర్లు.. అద్భుతమైన డీల్స్‌ వివరాలివే..!

|

Sep 21, 2023 | 5:45 PM

ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అద్భుతమైన ఆఫర్‌లు, డీల్స్‌తో డిస్కౌంట్‌లతో ముందుకు వచ్చింది. కానీ ఇది కేవలం పరిమిత సమయం వరకు ఉంటుంది. ఓలా కంపెనీ కస్టమర్లుల ఇప్పుడు వారి ఓలా ఎస్‌1 లైనప్‌లో రూ. 19,500 లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపును అందిస్తుంది. ఇది కాకుండా కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు, పొడిగించిన వారెంటీలపై 50 శాతం తగ్గింపులు అందిస్తుంది.

OLA Offers: ఓలా ఎస్‌1 స్కూటర్లపై అదిరే ఆఫర్లు.. అద్భుతమైన డీల్స్‌ వివరాలివే..!
Ola S1x
Follow us on

భారతదేశంలో పండుగ సీజన్ వచ్చేసింది. దీంతో అగ్ర వాహన తయారీదారులు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా టూ వీలర్స్‌పై గొప్ప డీల్స్‌ను అందిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఓలా కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తుంది. ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అద్భుతమైన ఆఫర్‌లు, డీల్స్‌తో డిస్కౌంట్‌లతో ముందుకు వచ్చింది. కానీ ఇది కేవలం పరిమిత సమయం వరకు ఉంటుంది. ఓలా కంపెనీ కస్టమర్లుల ఇప్పుడు వారి ఓలా ఎస్‌1 లైనప్‌లో రూ. 19,500 లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపును అందిస్తుంది. ఇది కాకుండా కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు, పొడిగించిన వారెంటీలపై 50 శాతం తగ్గింపులు అందిస్తుంది. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజులు, జీరో-కాస్ట్ ఈఎంఐ వంటి పలు ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటించింది.

ఓలా ఎస్‌ 1 ధర

ఓలా  కంపెనీ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఓలా ఎస్‌1 ప్రో, ఎస్‌ 1 ఎయిర్‌, ఓలా ఎస్‌1 ఎక్స్‌ మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్స్‌ ప్రారంభ ధర వరుసగా రూ. 1.47 లక్షలు, రూ. 1.1 లక్షలు, రూ. 89,999గా ఉంటుంది. అయితే ఈ ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. అయితే మనం కొనుగోలు చేసే నగరాలు లేదా రాష్ట్రాల్లో ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

ఓలా మూవ్‌ బీటా వెర్షన్‌

ఓలా ఎస్‌1 శ్రేణి యజమానులందరికీ మెరుగైన గడువును అందించడానికి కంపెనీ బీటా వెర్షన్‌లో మూవ్‌ ఓఎస్‌ 4.0 సాఫ్ట్‌వేర్‌ నవీకరణను అందించింది. ప్రస్తుతం, ఈ వెర్షన్ పరిమిత కస్టమర్లకు అందుబాటులో ఉంది. చివరి వెర్షన్ అక్టోబర్ 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఓలా మూవ్‌ ఓఎస్‌ ఫీచర్లు

ఓలా తాజా అప్‌డేట్ చేయబడిన సాఫ్ట్‌వేర్ 20 ప్లస్ కొత్త ఫీచర్లతో వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని సెగ్మెంట్‌లో మరింత అధునాతనంగా, తెలివైనదిగా చేస్తుంది. మూవ్‌ ఓస్‌ 4.0 బీటా వెర్షన్‌ ఓలా మ్యాప్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఇది ప్రత్యేకంగా కంపెనీ ద్వారా రూపొందించారు. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించడం ద్వారా రైడింగ్ గడువును సున్నితంగా, సులభంగా చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..