FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై మతిపోయే వడ్డీ రేట్ల ఆఫర్.. ఇక పెట్టుబడిదారులకు పండగే..!

గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై కళ్లు చెదిరే వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నాయి. అయితే గత నాలుగు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచినా ఆర్థిక సంవత్సర చివర్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు మళ్లీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా కాలం పాటు ఆకర్షణీయం కాని పెట్టుబడి సాధనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంక్ ఎఫ్‌డీలు ఇప్పుడు 7.75 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి.

FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై మతిపోయే వడ్డీ రేట్ల ఆఫర్.. ఇక పెట్టుబడిదారులకు పండగే..!
Money

Updated on: Feb 29, 2024 | 7:30 PM

ఇటీవల కాలంలో భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు నమ్మకమైన పెట్టుబడి ఆప్షన్‌గా నిలిచాయి. చాలా మంది ఎఫ్‌డీల్లో ఇచ్చే వడ్డీ రేట్లను ఆకర్షితులై పెట్టుబడికి ముందుకు వస్తూ ఉంటారు. గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై కళ్లు చెదిరే వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నాయి. అయితే గత నాలుగు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచినా ఆర్థిక సంవత్సర చివర్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు మళ్లీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా కాలం పాటు ఆకర్షణీయం కాని పెట్టుబడి సాధనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంక్ ఎఫ్‌డీలు ఇప్పుడు 7.75 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.60 శాతం వరకు ఎఫ్‌డి రేట్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు బ్యాంకుల్లో ఎఫ్‌డీల వడ్డీ రేట్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి ఆరు నెలల కంటే సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • ఆరు నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 18 నెలల 1 రోజు నుంచి 21 నెలల కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌

  • 7 రోజుల నుండిచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 271 రోజుల నుంచి 299 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం
  • 300 రోజులకు సాధారణ ప్రజలకు – 7.05 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.55 శాతం
  • 300 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువకు సాధారణ ప్రజలకు – 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం
  • ఒక సంవత్సరం సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం
  •  1 సంవత్సరం నుంచి 399 రోజులు పైన సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 400 రోజులకుసాధారణ ప్రజలకు – 7.25 శాత, ; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 401 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • రెండు సంవత్సరాల నుంచి  3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

ఐసీఐసీఐ బ్యాంక్

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు  4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 185 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 271 రోజుల నుంచి  ఒక ఏడాది కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 15 నెలల నుంచి రెండేళ్ల వరకూ సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి