Budget Cars: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లు ఇవే..

|

Jan 26, 2023 | 5:35 PM

కొత్త కారు కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కోసం వెతుకుతున్నారా.? మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్‌ కార్లు, ఫీచర్లు, ధరలాంటి వివరాలు మీకోసం..

Budget Cars: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లు ఇవే..
Best Cars
Follow us on

కొత్త కారు కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కోసం వెతుకుతున్నారా.? మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్‌ కార్లు, ఫీచర్లు, ధరలాంటి వివరాలు మీకోసం..

hyundai grand i10 nios facelift: ఇటీలే మార్కెట్లోకి వచ్చిన హ్యుండయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ప్రారంభ ధర రూ. 5.58 లక్షలుగా ఉంది. ఇందులో ఆర్‌డీఈ కంప్లైంట్ 1.2-L NA పెట్రోల్ ఇంజన్ అందించారు. కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.7 మైలేజ్‌, ఆటోమేటిక్ వేరియంట్‌లో మైలేజ్ 20.1 మైలేజ్‌ ఇస్తుంది. CNG వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది. CNG వేరియంట్‌తో గ్రాండ్ నియోస్ ఫేస్‌లిఫ్ట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు.

TATA punch: తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో టాటా కంపెనీకి చెందిన పంచ్‌ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలుగా ఉంది. ఈ కారులో 84.48bhp పవర్, 113Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-L న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ Revotron పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. దీని క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ వంటి అన్ని ఫీచర్లు ఇచ్చారు.

Nissan Magnite: రూ. 7 లక్షల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ ఒకటి. దీని బేస్ మోడల్ ‘XE’ వేరియంట్‌ రూ. 5.97 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కారులో 71.05bhp పవర్‌ను ఉత్పత్తి చేయగల 1.0-L న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఈ కారు ప్రత్యేకతలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..