Tobacco Products: సిగరెట్లు తాగేవారికి బ్యాడ్‌న్యూస్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లు తాగేవారిపై మరింత భారం పడనుంది. జేబుకు మరింతగా చిల్లులు పడనున్నాయి. ఎందుకంటే వాటి రేట్లను ప్రభావితం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను భారీగా పెంచింది. దీంతో ఇక..

Tobacco Products: సిగరెట్లు తాగేవారికి బ్యాడ్‌న్యూస్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
Cigarette

Updated on: Jan 01, 2026 | 6:25 PM

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. తగ్గించడమో లేదా పెంచడమో చేస్తూ ఉంటుంది. గత ఏడాది కార్లు, బైక్‌లపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వాటి ధరలు తగ్గాయి. ఈ క్రమంలో కొత్త ఏడాది 2026లో కేంద్రం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు భారీగా పెంచింది. దీంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులపై దీని ప్రభావం పడనుంది. వాటి రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో సిగరెట్ తాగేవారిపై మరింత భారం పడనుంది.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

ఫిబ్రవరి 1 నుండి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్సు విధించనున్నట్లు జనవరి 1తేదీన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు లాంటి ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుందని, ఇక బీడీలపై 18 శాతం జీఎస్టీ విధించున్నట్లు తన ప్రకనటలో తెలిపింది. ఇక పాన్ మసాలాపై కూడా సెస్, ఎక్సైజ్ సుంకం విధించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాన్ మసాలా తయారీపై కొత్త ఆరోగ్య జాతీయ భద్రతా సెస్, పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి అనుమతించే రెండు బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు పెంచుతున్నారు.

పెరగనున్న సిగరెట్ల ధరలు

కేంద్రం బిల్లులను ఆమోదించినప్పటికీ ఎప్పటినుంచి అమల్లోకి తీసుకొస్తారనే దానిపై మొన్నటివరకు క్లారిటీ రాలేదు. వెంటనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశముందని వార్తలు వినిపించాయి. గురువారం అధికారికంగా కేంద్రం డేట్ ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చినట్లయిది. కేంద్ర జీఎస్టీ రేట్లు పెంచడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లు, పాన్ మసాలా, బీడీ రేట్లు భారీగా పెరగనున్నాయి. సిగరెట్లు, పాన్ మసాలా లాంటివి అలవాటు ఉన్నవారికి ఇది బిగ్ షాక్‌గా చెప్పవచ్చు.