Robert Kiyosaki: ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!

Robert Kiyosaki: ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య నేర్పకపోవడమే ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా..

Robert Kiyosaki: ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Robert Kiyosaki

Updated on: Apr 06, 2026 | 5:40 AM

Robert Kiyosaki: ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఒక భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్థిక సంక్షోభానికి దశాబ్దాల క్రితం అంటే 1974లో జరిగిన కొన్ని కీలక మార్పులే కారణమని ఆయన విశ్లేషించారు.

1974: వినాశనానికి పునాది పడిన ఏడాది: 

“బ్యాడ్ న్యూస్.. చరిత్ర పునరావృతమవుతోంది” అంటూ కియోసాకి తన తాజా పోస్ట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు ఎలా దారితీశాయో ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

పెట్రో డాలర్ వ్యవస్థ – చమురు యుద్ధాలు:

1974 వరకు అమెరికా డాలర్‌కు ‘బంగారం’ వెన్నుముకగా ఉండేది. కానీ ఆ ఏడాది నుంచి డాలర్ ‘పెట్రో డాలర్’గా మారింది. అంటే బంగారం స్థానంలో ‘చమురు’ (Oil) డాలర్ విలువను శాసించడం మొదలుపెట్టింది. దీనివల్ల 2026లో చమురు నిల్వల కోసం దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.

పెన్షన్ వ్యవస్థలో మార్పు – రిటైర్మెంట్ భయం:

1974లో అమెరికాలో వచ్చిన ‘ERISA’ చట్టం వల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయాయి. వాటి స్థానంలో 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయి. 401(k)లు, IRAలు401(k)లు అనేవి పన్ను ప్రయోజనాలు గల పదవీ విరమణ పొదుపు ఖాతాలు. దీనివల్ల కోట్లాది మంది వృద్ధులు తమ పదవీ విరమణ తర్వాత ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని కియోసాకి జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, ఇది లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అప్పుల ఊబిలో అమెరికా

ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య నేర్పకపోవడమే ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: Financial Lessons: మీరు ధనవంతులు కావాలంటే ఈ 5 అలవాట్లను వదిలేయాల్సిందే..!

మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?

ఈ పెను ముప్పు నుండి బయటపడటానికి కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు.

  1. నిజమైన సంపదను పోగుచేయండి: కేవలం కాగితపు కరెన్సీని (ఫియట్ మనీ) నమ్ముకోకండి. మీ పెట్టుబడులను బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin) లలో ఉంచాలని ఆయన సూచించారు.
  2. మంచి గురువులను ఎంచుకోండి: యూట్యూబ్ వంటి వేదికల ద్వారా డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోండి. అయితే, ఆర్థిక విషయాల్లో మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
  3. మీ బాధ్యత మీదే: మీ ఆర్థిక భవిష్యత్తును ప్రభుత్వం లేదా ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి. “1974లో మొదలైన పతనం ఇప్పుడు మన కళ్లముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకండి” అని కియోసాకి పిలుపునిచ్చారు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us