Tesla: కొన్ని కొన్ని వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. కంపెనీ అన్ని రకాల టెస్ట్ నిర్వహించి విడుదల చేసిన వాహనాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. వాహనదారుల ఫిర్యాదు తర్వాత కంపెనీ వాహనాలను రీకాల్‌కు ఆదేశించిస్తుంటుంది. ఇక తాజాగా టెస్లాలో కూడా అలాంటి సమస్య తలెత్తింది. టెస్లా (Tesla) US లో తన 947 ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ (Recalls) చేయడం ప్రారంభించింది. వాహనాల్లో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా తిరిగి వెనక్కి రప్పించుకుంటోంది కంపెనీ. కారును రివర్స్ చేసిన సమయంలో రియర్‌వ్యూ ఇమేజ్ డిస్‌ప్లే సమస్య (Rearview Image Display Problem) తలెత్తింది. దీని కారణంగా రీకాల్ జారీ చేసినట్లు టెస్లా తెలిపింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA ) ప్రకారం.. రీకాల్‌లో 2018-2019 మోడల్ S, మోడల్ X మరియు 2017-2020 మోడల్ 3 ( టెస్లా మోడల్ 3 ) ఉన్నాయి. ఈ ఆటోపైలట్ కంప్యూటర్‌లు అన్నీ 2.5తో అమర్చబడి ఉన్నాయి. అలాగే కొన్ని ఫర్మ్‌వేర్ విడుదలను ఆపరేట్ చేస్తున్నాయి.
ఈ వాహనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు. అయితే కంపెనీ ఇచ్చిన ప్రతిపాదనలో సమస్యను పరిష్కరించడానికి ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తామని పేర్కొంది. రియర్‌వ్యూ కెమెరా సమస్య ఉండటంతో వాహనం రివర్స్ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రమాదం ఉండే అవకాశం ఉండటంతో కంపెనీ ఈ రీకాల్ నిర్ణయం తీసుకుంది.
టెస్లా డిసెంబరులో పరిమిత సంఖ్యలో వాహనాల కోసం కొత్త ఫర్మ్‌వేర్‌ను విడుదల చేసింది. దాని ఫ్లీట్ మానిటరింగ్ పరికరాలు టెస్లా మోడల్ 3 కోసం కంప్యూటర్ రీసెట్ కారణంగా ఇప్పుడు సాధారణ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడం ప్రారంభించడంతో సమస్య తలెత్తింది. ఈ సమస్యకు సంబంధించి మార్చి 18న రీకాల్ నోటీసు జారీ చేసింది కంపెనీ. టెస్లా రియర్‌వ్యూ ఇమేజ్ సమస్యపై ఇంజనీరింగ్ పరిశోధనలో సాఫ్ట్‌వేర్ లోపం వల్ల సమస్య ఏర్పడిందని వెల్లడించింది. ఫిబ్రవరి 9న NHTSA ఈ కార్లలో సాంకేతిక కారణాలపై కస్టమర్‌లు ఫిర్యాదుకు సంబంధించి కార్లపై పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. టెస్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి: