Tesla Market Cap: టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్టోబరు 25న మొదటిసారిగా ఒక ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. దీంతో మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్ యొక్క పేరెంట్) వంటి సంస్థలను కలిగి ఉన్న ఎలైట్ క్లబ్‌లో అమెరికన్ EV (ఎలక్ట్రిక్ వాహనం) తయారీదారుని చేర్చింది. ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్(Apple, Amazon, Facebook) ట్రిలియన్ యూఎస్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. ఫేస్‌బుక్ తర్వాత ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను అతివేగంగా అధిగమించిన రెండవ కంపెనీ టెస్లా. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ జూన్ 2010లో పబ్లిక్ కంపెనీగా అవతరించింది. ఈ మైలురాయిని దాటడానికి 11 సంవత్సరాలు పట్టింది.
టెస్లా షేర్లు దాదాపు 13 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,024.86 యూఎస్ డాలర్ల వద్ద ముగియడంతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్లను దాటింది. టెస్లా షేరు ధర ఒక్కో షేరుకు 1,000 డాలర్లకు చేరడం కూడా ఇదే మొదటిసారి. కార్ రెంటల్ దిగ్గజం హెర్ట్జ్ టెస్లా నుండి 1,00,000 EVలను కొనుగోలు చేస్తుందనే వార్తల తో టెస్లా షేర్లకు ప్రధాన పుష్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా షేర్ల ధరలు పెరిగాయి.
టెస్లా కార్లు..
టెస్లా (Tesla) మోడల్ 3, మోడల్ Y, మోడల్ S, మోడల్ X వంటి ఈవీలను విక్రయిస్తుంది. ఈ వాహన తయారీదారు నవంబర్ 2019లో సైబర్‌ట్రక్‌ను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీని ఉత్పత్తి 2022 చివరిలో ప్రారంభమవుతుంది.
భారతదేశంలో టెస్లా: భారతదేశంలో మోడల్ 3 త్వరలో..
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు మోడల్ 3ని టెస్లా త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. అమెరికా మార్కెట్‌లో, మోడల్ 3 స్టాండర్డ్ ప్లస్ (RWD), లాంగ్ రేంజ్ (AWD, పెర్ఫార్మెన్స్ (AWD) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ప్లస్ క్లెయిమ్ చేసిన పరిధి 423కిమీ. గరిష్ట వేగం గంటకు 225కిమీ. లాంగ్ రేంజ్ క్లెయిమ్ చేసిన పరిధి 568కిమీ. గరిష్ట వేగం గంటకు 233కిమీ. పెర్ఫార్మెన్స్ క్లెయిమ్ చేయసిన పరిధి 507కిమీ, గరిష్ట వేగం గంటకు 261కిమీ.
ఈవీ తయారీదారులు ఈవీలపై దిగుమతి పన్నులను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెస్లా ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల భారత ప్రభుత్వ అధికారులను కలిసి ఈవీలపై అధిక దిగుమతి పన్నులపై చర్చించి వాటిని తగ్గించాల్సిందిగా అభ్యర్థించారు. 40,000 డాలర్ల వరకు ధర ఉన్న ఈవీలపై భారత ప్రభుత్వం 60 శాతం దిగుమతి పన్ను విధించింది అలాగే 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ట్యాగ్ ఉన్న ఈవీలపై 100 శాతం విధించింది.
వేరియంట్ వారీగా టెస్లా మోడల్ 3 ధరలు క్రింది విధంగా ఉన్నాయి (కొనుగోలు ధరలు, అమెరికా)
ఇవి కూడా చదవండి: Jio Phone Next: ప్రగతి ఓఎస్ తో జియోఫోన్ నెక్స్ట్.. జియో విడుదల చేసిన సరికొత్త ఫీచర్లు ఇవే!
NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!