Elon Musk: తక్కువ ధరకే ట్విట్టర్ ను చేజిక్కించుకోనున్న ఎలాన్ మస్క్..! ఎలాగంటే..

|

May 17, 2022 | 8:49 AM

Elon Musk: ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనగోలు డీల్ నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే.. మెుత్తం ట్విట్టర్ వద్ద ఉన్న 229 మిలియన్ ఖాతాల్లో 20 శాతం వరకు స్పామ్ బోట్స్(నకిలీ ఖాతాలు) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Elon Musk: తక్కువ ధరకే ట్విట్టర్ ను చేజిక్కించుకోనున్న ఎలాన్ మస్క్..! ఎలాగంటే..
Elon Musk
Follow us on

Elon Musk: ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనగోలు డీల్ నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే.. మెుత్తం ట్విట్టర్ వద్ద ఉన్న 229 మిలియన్ ఖాతాల్లో 20 శాతం వరకు స్పామ్ బోట్స్(నకిలీ ఖాతాలు) ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఇంతకు ముందు నిర్ణయించిన 44 బిలియన్ డాలర్లకు బదులుగా.. తక్కువ చెల్లించనున్నట్లు క్లూ ఇచ్చారు. మియామీ టెక్నాలజీ సదస్సులో దీనిపై మాట్లాడారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించిన కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతి క్వార్టర్ లోనూ ఈ ఖాతాల సంఖ్య 5 శాతానికంటే తక్కువగానే ఉంటున్నట్లు తాము గుర్తించినట్లు పరాగ్ తెలిపారు.

స్పామ్ ఖాతాలపై పూర్తి వివరాలు అందించనందున డీల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ కు యాడ్స్ ఇచ్చే కంపెనీలకు తాము చెల్లించే మెుత్తానికి ఉపయోగం ఎంత వరకు ఉంటోంది. ఈ విషయం ట్విట్టర్ ఆర్థిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అందువల్ల ఫేక్ ఖాతాల వివరాలు తప్పక తనకు తెలియాల్సిందేనని మస్క్ అంటున్నారు. ట్విట్టర్ లెక్కల ప్రకారం ఈ ఖాతాల సంఖ్య కేవలం 5 శాతానికంటే తక్కువగా ఉన్నాయనే వాదనతో మస్క్ అంగీకరించటం లేదు. ఈ కారణంగా ట్విట్టర్ ను తక్కువకే కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే ఎలాన్ మస్క్ ఇంతకు ముందు ఆఫర్ చేసిన 44 బిలియన్ డాలర్లకు బదులుగా.. తక్కువ మెుత్తాన్ని చెల్లించేందుకు చూస్తున్నట్లు వారు అంటున్నారు. ఒక వేళ నిజంగా టెస్లా సీఈవో ఇటువంటి ప్రతిపాదనతో వస్తే ట్విట్టర్ అంగీకరిస్తుందా.. లేక డీల్ రిజక్ట్ చేస్తుందా అనే విషయాలపై స్పష్టత రావలసి ఉంది. ఏదేమైనా మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న నాటి నుంచి అనేక ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి