Tega Industries: హిట్టైన టెగా ఇండస్ట్రీస్‌ ఐపీవో.. లిస్టింగ్ రోజే మదుపరులపై కాసుల వర్షం..

టెగా ఇండస్ట్రీస్‌ ఐపీవో లిస్టింగ్ రోజు మదుపరులకు కాసుల వర్షం కురిపించింది. సోమవారం స్టాక్‌ మార్కెట్లలో 68 శాతం ఎక్కువతో ఈ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి...

Tega Industries: హిట్టైన టెగా ఇండస్ట్రీస్‌ ఐపీవో.. లిస్టింగ్ రోజే మదుపరులపై కాసుల వర్షం..
Bulk Deal

Updated on: Dec 14, 2021 | 9:45 AM

టెగా ఇండస్ట్రీస్‌ ఐపీవో లిస్టింగ్ రోజు మదుపరులకు కాసుల వర్షం కురిపించింది. సోమవారం స్టాక్‌ మార్కెట్లలో 68 శాతం ఎక్కువతో ఈ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ స్టాక్ మొదటి రోజు రూ.726 వద్ద ముగిసింది. మైనింగ్‌ పరిశ్రమలో పరికరాలను సరఫరా చేసే టెగా కంపెనీ ఇష్యూ ధర రూ.453తో మార్కెట్లోకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో 68 శాతం ఎక్కువతో అంటే రూ.760, బీఎస్‌ఈలో 66 శాతం అధికంగా అంటే రూ.753 వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,991 కోట్లకు చేరుకుంది.

టెగా ఒక్కో లాట్‌కు 33 షేర్లను కేటాయించింది. అంటే లాట్‌ కొనుగోలు విలువ రూ.14,949. అంటే కేటాయింపు దక్కిన వారికి లిస్టింగ్ ధర రూ.753తో పోలిస్తే రూ.24,849కి పెరిగింది. ఒక లాట్‌కు రూ.9,900 లాభం వచ్చిందన్న మాట. ఈ లెక్కన 10 లాట్లు కొన్న వారికి దాదాపు 90 వేలకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది.

కంపెనీ లిస్ట్‌ అవ్వగానే ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగం విక్రయించినట్లు తెలిసింది. ఇష్యూకు ముందు వారికి 85.17 శాతం వాటా ఉండగా లిస్టైన తర్వాత వారి వాటా 79.17కు తగ్గింది. పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 14.83 శాతం నుంచి 20.83 శాతానికి పెరిగింది. టెగా ఇండస్ట్రీస్‌ 2018-19 నుంచి 2020-21 వరకు 12.7 శాతం సీఏజీఆర్‌తో ఆదాయం పెంచుకుంది. ఇదే సమయంలో నికర లాభం 104 శాతం ఉంది. ఇండస్ట్రీ ఔట్ లుక్ కూడా బుల్లిష్ గా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ కంపెనీని తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవచ్చని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆయుష్ అగర్వాల్ చెప్పారు.

Read Also.. LIC Dhan Rekha: ఎల్ఐసీ నుంచి ధన్ రేఖ పథకం.. థర్డ్ జెండర్ వారు అర్హులే..