
మీరు ఆదాయ పన్ను పరిధిలో ఉన్నారా? ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? అయితే మీకో అలర్ట్. మీరు ఆధార్ పాన్ లింక్ అయ్యి ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే వెంటనే చేసేయండి.. మే 31లోపు ఆ పనిని పూర్తి చేయకపోతే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్), ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్) చాలా ఎక్కువగా వసూలు చేస్తారు. ఈ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తన సోషల్ మీడియా ప్లాట్ పారంలో షేర్ చేసింది. పన్ను చెల్లింపుదారులు అందరూ మే 31లోపు తమ ఆధార్, పాన్ లింక్ చేయాలని మే 28న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ ఫారంలో ఓ పోస్ట్ పెట్టంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Kind Attention Taxpayers,
Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.
Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI
— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024
పన్ను చెల్లింపుదారులందరూ తప్పనిసరిగా తమ ఆధార్-పాన్ లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. లేకుంటే అధికంగా టీడీఎస్/టీసీఎస్ కట్ అవుతుందని పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం ఇది జరుగుతుందని చెప్పింది. ఆపరేషన్లో లేని ప్యాన్ కారణంగా మార్చి 31 నుంచే లావాదేవీలు నిలిచిపోయాయని పేర్కొంది. ఎందుకంటే ఆధార్ తో లింక్ చేయని పాన్ నంబర్ ఆటోమేటిక్ గా ఇన్ ఆపరేటివ్ గా మారిపోతాయి. ఈ మేరకు ఏప్రిల్ 23న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ సర్కులర్ ను పబ్లిష్ చేసింది. ఈ సర్కులర్ లోనే పలు నిబంధనలను సైతం పేర్కొంది. ఒకవేళ ఆధార్ పాన్ లింక్ చేయకపోతే జరిగే పర్యావసనాలను కూడా వివరించింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం జూలై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా నంబర్ (పాన్) కేటాయించబడిన, ఆధార్ నంబర్ను పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్ను లింక్ చేయాలి. మీరు 30 జూన్ 2023 లోపు మీ పాన్ ను మీ ఆధార్తో లింక్ చేయకుంటే, మీ పాన్ పనిచేయకుండా పోతుంది. అయితే, మినహాయింపు పొందిన కేటగిరీ కిందకు వచ్చే వ్యక్తులు పాన్ పనిచేయకుండా పోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..