TATA Digital: దిగ్గజ ఈ కామర్స్ సైట్‌లకు గట్టిపోటీ ఇచ్చే దిశగా టాటా అడుగులు.. టాటా సన్స్ భారీ పెట్టుబడులు..
TATA Digital: ప్రస్తుతం ఈకామర్స్ రంగం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఈరంగంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రంగంలోకి టాటా గ్రూప్ కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో...
TATA Digital: ప్రస్తుతం ఈకామర్స్ రంగం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఈరంగంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రంగంలోకి టాటా గ్రూప్ కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టాటా డిజిటల్ పేరుతో కంపెనీని గతంలోనే స్థాపించారు. తాజాగా ఈ కంపెనీలో టాటా సన్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ఒకే ట్రాన్సాక్షన్‌లో ఏకంగా రూ. 5,882 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
దీంతో 2021-22లో టాటా డిజిటల్‌లో టాటా సన్స్ పెట్టబడులు రూ. 11,872 కోట్లకు చేరాయి. ఇదిలా ఉంటే టాటా అందిస్తోన్న ఆన్‌లైన్ సేవలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొస్తూ టాటా న్యూ పేరుతో యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో క్రోమా, టాటా క్లిక్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాటా సన్స్‌కు రూ. 10 ఫేస్ విలువ ఉన్న రూ. 5,882 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఇష్యూ చేయడానికి టాటా డిజిటల్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.
ఇదిలా ఉంటే టాటా డిజిటల్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కంపెనీలో పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో తాజాగా టాటా సన్స్ చేసిన రూ. 5,882 కోట్లు సగం కావడం విశేషం. ఇలా భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ కామర్స్ రంగంలో తమదైన ముద్ర వేయడానికి టాటా గ్రూప్ ప్రయత్నిస్తుందనే సంకేతం ఇస్తుందని అల్టో ఇన్ఫో ఫౌండర్ మోహిత్ యాదవ్ అభిప్రాయపడ్డారు.