భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన ఆల్ట్రోజ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో రికార్డు అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించిందీ కార్. అయితే తాజాగా ఈ టాటా కంపెనీ ఆల్ట్రోజ్ నుంచి మరో వేరియంట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త కారును తీసుకొచ్చింది.
ఆల్ట్రోజ్ రేసర్ పేరుతో ఈ కారును లాంచ్ చేసింది. ఈ కారును ఆర్1, ఆర్2, ఆర్3 పేరుతో మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ కొత్త కారును లాంచ్ చేశారు. ఆల్ట్రోజ్ రేసర్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఆర్2 వేరియంట్ ధర రూ. 1 లక్ష అదనంగా నిర్ణయించారు. అలాగే ఆర్3 వేరియంట్ ధర అదనంగా మరో రూ. లక్షన్నరగా ఉంది. ఈ కారును ప్యూర్ గ్రే, అటామిక్ ఆరెంజ్ అవెన్యూ వైట్ రంగుల్లో తీసుకొచ్చారు.
ఆల్ట్రోజ్ కారు ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు ఎక్స్‌టీరియర్‌ను పూర్తిగా స్పోర్టీ లుక్‌లో డిజైన్ చేశారు. బ్లాక్-అవుట్ బానెట్, రేసింగ్ స్ట్రిప్స్‌తో పాటు రూఫ్, ఆల్ట్రోజ్ రేసర్‌కు స్టోర్టీ లుక్‌ను తీసుకొచ్చింది. ఇక ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులే చేశారు. వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేడ్ ఫ్రంట్ సీట్స్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు.
ఇక సెక్యూరిటీ డివైజ్‌ల పరంగా చూస్తే ఇందులో ఏబీఎస్, ఈఎస్‌సీలతో పాటు 6 ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. అలాగే ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కన్నా పెద్ద యూనిట్‌ను అందించారు. ఇక ఇంజన్ విషయానికొస్తే ఈ కారులో 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు. 118బీహెచ్‌పీ, 170ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..