AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Car: వారం రోజుల్లో ఆ టాటా ఈవీ కారు లాంచ్.. మైలేజ్ విషయంలో నో పోటీ..!

టాటా మోటర్స్ లవర్స్ ఎప్పటినుంచో ఆసక్తి ఎదురుచూస్తున్న ఈవీ ఎస్‌యూవీ హారియర్ గురించి కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ ఈవీ కారు లాంచ్ తేదీని అధికారంగా ప్రకటించింది. భారతదేశంలో టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అత్యంత అధునాతన ఫీచర్లతో హారియర్ ఈవీను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తామని పేర్కొంది.

EV Car: వారం రోజుల్లో ఆ టాటా ఈవీ కారు లాంచ్.. మైలేజ్ విషయంలో నో పోటీ..!
Tata Harrier Ev
Nikhil
|

Updated on: May 25, 2025 | 6:30 PM

Share

టాటా హారియర్ ఈవీ ఎస్‌యూవీ కారు జూన్ 3, 2025న ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ కారును ప్రవేశపెట్టారు. హారియర్ ఈవీ కంపెనీకు సంబంధించిన యాక్టి ఈవీ ప్లస్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఓమేగా ఆర్కిటెక్చర్‌ ఆధారంగా ఈ కారు పని చేస్తుంది. ఈ ఎస్‌యూవీ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. హారియర్ ఈవీ దాదాపు 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ కారును ఓ సారి ఫుల్‌గా చార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని కంపెనీ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రకటించింది. అయితే ఈ ఈవీ కారు బ్యాటరీ ప్యాక్‌నుకు సంబంధించిన సమాచారం పూర్తిగా వెల్లడించలేదు.

ఫీచర్స్‌లో రారాజు

హారియర్ ఈవీ లుక్ ప్రస్తుత హారియర్ (ఐసీఈ వెర్షన్) లాగానే ఉంటుంది. కానీ ఈవీ వెర్షన్‌కు మాత్రం కొన్ని ప్రత్యేక ఎలిమెంట్స్ జోడించారు. ఈ కారు ముందు భాగంలో పూర్తి వెడల్పుతో డీఆర్ఎల్ స్ట్రిప్‌ను యాడ్ చేశారు. నిలువు స్లాట్‌లతో గ్రిల్, బంపర్‌లు ఆకట్టుకుంటాయి. ఏరో స్టైల్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ సెటప్, ఈవీ బ్యాడ్జింగ్, డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆర్కడే ఈవీఇంటర్‌ఫేస్‌తో యాప్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయిన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కారులో ముఖ్యంగా వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, జేబీఎల్, సరౌండ్ సౌండ్ సిస్టమ్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, క్లౌడ్ ఆధారిత టెలిమాటిక్స్ వంటి ఫీచర్లు ఈ కారును ఇతర కారు నుంచి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. 

టాటా హారియర్ ఈవీ ధర 

టాటా హారియర్ ఈవీ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఈవీ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో నేరుగా పోటీపడుతుంది. ఇప్పటికే టియాగో ఈవీ, టైగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి కార్లను రిలీజ్ చేసిన టాటా కంపెనీ ఈవీ కార్ల సరసన హారియర్ ఈవీ చేరనుంది. అలాగే టాటా కంపెనీ త్వరలో సయేరా ఈవీను కూడా ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి