TATA Group: ‘ఎయిర్ ఇండియా’ టాటా గ్రూప్ చేతికి.. ఆమోదం తెలిపిన సీసీఐ

|

Dec 20, 2021 | 8:55 PM

టాటా సన్స్ యాజమాన్య అనుబంధ సంస్థ.. టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ అదేవిధంగా ఎయిర్ ఇండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.

TATA Group: ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతికి.. ఆమోదం తెలిపిన సీసీఐ
Tata Takeover Air India
Follow us on

TATA Group: టాటా సన్స్ యాజమాన్య అనుబంధ సంస్థ.. టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ అదేవిధంగా ఎయిర్ ఇండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదిత కలయికలో టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TALES) ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఎయిర్ ఇండియా), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ (AIXL) 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఎయిర్ ఇండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISATS) 50% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉన్నాయి. ఈ కొనుగోలు ఆమోదం పొందిందని సీసీఐ సమాచారం ఇచ్చింది.

ప్రభుత్వం ఏమందంటే..

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టేల్స్ బిడ్‌ను గెలుచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 8న ప్రకటించింది. 18,000 కోట్లను ఆఫర్ చేయడం ద్వారా స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ బిడ్‌ను టాటా బీట్ చేసింది. అక్టోబరు 25న, పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ కోసం టాటా సన్స్‌తో ప్రభుత్వం వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ నెల ప్రారంభంలో, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఎయిర్ ఇండియాను టాటా సన్స్‌కు బదిలీ చేయడం వచ్చే 1 నుండి 1.5 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు.

కంపెనీల ప్రైవేటీకరణ

2003-04 సంవత్సరం తర్వాత 2021లో తొలిసారిగా ప్రభుత్వ కంపెనీలు ప్రైవేటీకరించడం పై ప్రక్రియ మొదలైంది. ఈ కంపెనీల పేర్లు CPSE, ఎయిర్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ 18,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్‌ను ఢిల్లీకి చెందిన నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ రూ.210 కోట్లకు కొనుగోలు చేసింది.

టేల్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా షేర్ హోల్డింగ్ కొనుగోలుకు ఆమోదం పొందింది. టేల్స్ అనేది పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ యాజమాన్య అనుబంధ సంస్థ. కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రధాన పెట్టుబడి సంస్థగా నమోదు చేయబడింది.”పెట్టుబడి సంస్థ”గా వర్గీకరించారు.

టాటా నుంచి ప్రభుత్వానికి ఎంత డబ్బు వస్తుంది..

వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా రుణం రూ. 46,262 కోట్లు ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL)కి బదిలీ అవుతుంది. మొత్తం రూ. 61,562 కోట్ల రుణంలో 15 శాతం టాటా గ్రూప్‌పై ఉంటుంది. టాటా నుంచి ప్రభుత్వానికి దాదాపు 2,700 కోట్ల నగదు లభిస్తుంది. టాటా కంపెనీ 15,300 కోట్ల రుణాన్ని తీసుకుంటుంది.

పవన్ హన్స్ ప్రైవేటీకరణ

అనేక ప్రభుత్వ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో హెలికాప్టర్ ఆపరేటర్ కంపెనీ అయిన పవన్ హన్స్ పేరు కూడా ఉంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాతో సహా 3 కంపెనీలు ప్రైవేటీకరణ జరిగింది. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ సంస్థ పవన్ హన్స్ ప్రైవేటీకరణ పనులు ముమ్మరం చేశారు.

హెలికాప్టర్ ఆపరేటర్ పవన్ హన్స్‌లో వాటాను విక్రయించడానికి ప్రభుత్వం అనేక ఆర్థిక బిడ్‌లను అందుకుంది. దీంతో పవన్‌ హన్స్‌ పెట్టుబడుల ఉపసంహరణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పవన్ హన్స్ ప్రైవేటీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని డీఐపీఏఎం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే దీనిపై ఓ ట్వీట్‌లో తెలిపారు. అయితే ఎంత మంది బిడ్డర్లు ఎంత మంది ఉన్నారు అనే సమాచారం మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?

Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి

Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్‌ శాపనార్థాలు