
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. నెమ్మదిగా ఈ వాహనాలు మార్కెట్ లో తన ముద్ర వేస్తున్నాయి. ఇప్పటికే ఈ శ్రేణి ద్విచక్ర వాహనాలు సేల్స్ లో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు సంప్రదాయ ఇంధన స్కూటర్లకు పోటీగా నిలబడుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్ లు కూడా పెద్ద ఎత్తున లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్విచ్ మోటో కార్ప్(Svitch MotoCorp) తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్విచ్ సీఎస్ఆర్ 762 పేరిట దీనిని రానున్న 90 రోజుల్లో మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రదర్శించారు. వాస్తవానికి 2022 ఆగస్టులోనే దీనిని మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్‌కు టెక్నాలజీ సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. దీంతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనిని అరంగేట్రానికి మూహుర్తం ఫిక్స్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్విచ్ సీఎస్సార్ 762 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి స్పెసిఫికేషన్లు చూద్దాం..
ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే విషయంపై స్విచ్ మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ ఖత్రి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా” పట్ల మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.”
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..