FD Rate Hike: గత కొంత కాలంగా దేశంలోని అనేక బ్యాంకులు వరుసగా తమ వడ్డీ రేట్లలో మార్పులు ప్రకటిస్తున్నాయి. తాజాగా అనేక బ్యాంకులు వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచుతున్నాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. మహారాష్ట్ర RBI-లైసెన్స్ కలిగిన ఏకైక చిన్న ఫైనాన్స్ రుణదాతగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంపుపై బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ సైకిల్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన తరుణంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే లక్ష్యంతో.. ఈ చర్య బ్యాంకులు NBFCలకు FDలతో సహా అన్ని రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడానికి కారణంగా నిలుస్తోంది.
కొత్త సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు జూన్ 6, 2022 నుంచి అమలులోకి వస్తాయని రుణదాత ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేటు రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 999 రోజుల కాలవ్యవధికి 7.99 శాతంగా నిర్ణయించింది. దీనికి, రెసిడెంట్ ఇండియన్స్ అయిన 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ పర్సనల్ మాత్రమే అర్హులు.
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.75 శాతం
- 15 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.75 శాతం
- 46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
- 91 రోజుల నుంచి 6 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 6 నెలల నుంచి 9 నెలల కంటే ఎక్కువ: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
- 9 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలలు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
- 1 సంవత్సరం 6 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
- 2 సంవత్సరాల నుంచి 998 రోజులకు పైన: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 999 రోజులు: సాధారణ ప్రజలకు – 7.49 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.99 శాతం
- 3 సంవత్సరాల, 1000 రోజులు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.80 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
- 5 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు – 6.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం
- 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.