Electric Scooter Gift: ఉద్యోగులకు దీపావళి బోనాంజా.. సంస్థ బోనస్‌గా ఏం ఇచ్చిందో తెలుసా.? ఏకంగా..

Electric Scooter Gift: సాధారణంగా పండుగల బోనస్‌లు ఇవ్వడం అన్ని కంపెనీల్లో ఓ ఆచారంగా ఉంటుంది. తమ సంస్థ వృద్ధికి సహాయ పడినందుకుగాను ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చి సంస్థలు..

Electric Scooter Gift: ఉద్యోగులకు దీపావళి బోనాంజా.. సంస్థ బోనస్‌గా ఏం ఇచ్చిందో తెలుసా.? ఏకంగా..
Diwali Gift To Employees

Updated on: Nov 07, 2021 | 12:50 PM

Electric Scooter Gift: సాధారణంగా పండుగల బోనస్‌లు ఇవ్వడం అన్ని కంపెనీల్లో ఓ ఆచారంగా ఉంటుంది. తమ సంస్థ వృద్ధికి సహాయ పడినందుకుగాను ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చి సంస్థలు ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే కొన్ని కంపెనీలు బోనస్‌ను డబ్బు రూపంలో ఇస్తే మరికొన్ని కంపెనీలు వస్తువుల రూపంలో ఇస్తుంటాయి. స్మార్ట్‌ ఫోన్‌లు, స్పీకర్లు ఇలా ఆయా సంస్థలకు తమకు తోచిన విధంగా ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తుంటాయి. అయితే సూరత్‌కు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా స్కూటర్లనే ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెంది అలియన్స్‌ అనే ఎంబ్రాయిడరీ సంస్థ దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. సంస్థ అభివృద్ధికి కారణమైన ఉద్యోగులకు ఏదైనా చేయాలని యాజమాన్యం భావించింది. ఆలోచన వచ్చిన వెంటనే దీపావళికి తమ ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు బహుమతి ఇస్తూనే మరోవైపు పర్యావరణానికి కూడా మేలు చేయాలని ఆలోచించారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులందరికీ ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని బహుమతిగా అందించింది.

ఈ స్కూటర్‌ విలువ ఎక్స్‌షోరూం ధర రూ. 76,848గా ఉంది. సంస్థలో ఉన్న మొత్తం 35 మంది ఈ స్కూటర్లను ఉచితంగా అందించారు. ఈ విషయమై అలయన్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్‌ ధరల నుంచి మా ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వాడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది అని చెప్పుకొచ్చాడు.

Also Read: Lip Care Tips: పెదాలు నల్లగా ఉన్నాయని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే చాలు తళతళ మెరిసిపోతాయ్..

Crime News: హైదరాబాద్ శివారులో విషాదం.. భార్య, పిల్లలు లేని సమయంలో ఉరి వేసుకుని ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

T20 World Cup 2021: కీలక మ్యాచ్ లో గెలిచేదెవరో? భారత జట్టు భవిష్యత్ ఆ జట్టు చేతిలో.. విచిత్ర స్థితిలో టీమిండియా..