
బేటీ బచావో – బేటీ పడావో నినాదంతో 2015 జనవరి 22న ప్రారంభమైన సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం దిగులు పడాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం.. ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ పథకంలో చక్రవడ్డీ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది..
వార్షిక పెట్టుబడి: రూ.1,50,000
పెట్టుబడి కాలం: 15 ఏళ్లు
మెచ్యూరిటీ కాలం: 21 ఏళ్లు
ప్రస్తుత వడ్డీ రేటు: 8.20శాతం
మీరు జమ చేసే మొత్తం: రూ.22,50,000
వడ్డీ ద్వారా వచ్చే లాభం: రూ. 49,32,119
మొత్తం మెచ్యూరిటీ సొమ్ము: రూ. 71,82,119
మీరు మెచ్యూరిటీ సమయంలో పూర్తి స్థాయిలో అంటే రూ. 71.8 లక్షలు పొందాలంటే.. ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుండి 5వ తేదీ లోపు డిపాజిట్ చేయడం మర్చిపోవద్దు.
ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం, కాబట్టి రిస్క్ సున్నా. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యధికంగా 8.20శాతం వడ్డీని దీనికే ఇస్తున్నారు. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. నెలకు కేవలం రూ. 250తో కూడా ఈ ఖాతాను తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి