Deepfake: ఆ వీడియోలు నమ్మి మోసపోవద్దు..! అలర్ట్‌గా ఉండాలంటూ సుధా మూర్తి షాకింగ్‌ పోస్ట్‌

సుధా మూర్తి తన పేరు, వాయిస్‌తో వస్తున్న డీప్‌ఫేక్ వీడియోల పట్ల ప్రజలను హెచ్చరించారు. ఈ నకిలీ వీడియోలు ఆర్థిక పథకాలు, పెట్టుబడులను ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆమె కోరారు. సమాచారాన్ని ధృవీకరించుకోవాలని, ఇటువంటి మోసపూరిత కంటెంట్‌ను నివేదించాలని సూచించారు.

Deepfake: ఆ వీడియోలు నమ్మి మోసపోవద్దు..! అలర్ట్‌గా ఉండాలంటూ సుధా మూర్తి షాకింగ్‌ పోస్ట్‌
Sudha Murty

Updated on: Jan 22, 2026 | 6:00 AM

ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి సతీమణి, రచయిత్రి, ది మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధా మూర్తి ఒక వీడియోను విడుదల చేశారు. తన పేరుతో, తన వాయిస్‌తో కొన్ని ఫేక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని వాటిని నమ్మి ఆర్థికంగా మోసపోవద్దని ఆమె హెచ్చరించారు. ఈ విషయమై ఆమె తన ఎక్స్‌లోని తన అఫిషీయిల్‌ అకౌంట్‌లో ఈ పోస్ట్‌ పెట్టారు.

‘నా ఇమేజ్, వాయిస్‌ని ఉపయోగించి ఫైనాన్షియల్‌ స్కీమ్స్‌, పెట్టుబడులను ప్రచారం చేయడానికి ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న నకిలీ వీడియోల గురించి నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. ఇవి నాకు తెలియకుండా లేదా అనుమతి లేకుండా సృష్టించబడిన డీప్‌ఫేక్‌ వీడియోలు. దయచేసి ఈ మోసపూరిత వీడియోల ఆధారంగా ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. పలు మార్గాల ద్వారా సమాచారాన్ని ధృవీకరించాలని, మీరు ఎదుర్కొనే అటువంటి కంటెంట్‌ను రిపోర్ట్‌ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్!’ అంటూ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి