
Success Story: విజయం ఒక్క రాత్రిలో రాదు. అది చిన్న ఆలోచనల నుంచి, సాధారణ పరిస్థితుల నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రూపుదిద్దుకుంటుంది. చిన్న ఆరంభం నుంచి కోట్ల విలువైన బ్రాండ్ వరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వ్యక్తి గజల్ అలోఘ్. ఆమె వ్యక్తిగత సవాలు ఆమె భర్త వరుణ్ అలోఘ్‌ను 2016లో మామఎర్త్‌ను ప్రారంభించడానికి ప్రేరేపించింది. ఇప్పుడు ఆమె మామఎర్త్ (Mamaearth) లాంటి బహుళ-బిలియన్ రూపాయల కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు.
హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన గజల్, ఎప్పుడూ పెద్ద వ్యాపార సామ్రాజ్యం కలలు కనలేదు. కానీ నేర్చుకునే తపన, కొత్తగా ఆలోచించే ధైర్యం ఆమెను అసాధారణ వ్యక్తిగా మలిచాయి. టెక్నాలజీలో చదువు, కళలపై ఆసక్తి ఈ రెండు విభిన్న రంగాల సమ్మేళనం ఆమెకు ప్రత్యేకమైన దృష్టిని కలిగించాయి. రోజుకు కేవలం 1200 రూపాయల జీతంతో NIITలో కెరీర్ ప్రారంభించిన గజల్.. ఆ సమయంలోనే ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. సమస్య కనిపిస్తే దానికే పరిష్కారం వెతకాలి. అదే ఆలోచన ఆమెను తొలి వ్యాపార ప్రయత్నమైన Dietexpert.com వైపు నడిపించింది. విజయం పెద్దగా రాకపోయినా, ఆ ప్రయోగం ఆమెకు వ్యాపారాన్ని అర్థం చేసుకునే పాఠశాలగా మారింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
గజల్ అలోఘ్ 1988 సెప్టెంబర్ 2న హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె పంజాబ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో మోడర్న్, ఫిగరేటివ్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టెక్నాలజీపై బలమైన పునాది, కళలపై లోతైన ఆసక్తి ఆమెకు ప్రత్యేకమైన ఆలోచనా విధానాన్ని ఇచ్చాయి. అదే ఆలోచన ఆమె బ్రాండ్‌లో స్పష్టంగా ప్రతిబింబించింది.
జీవితంలో మలుపు ఆమె తల్లి అయిన తర్వాత వచ్చింది. తన బిడ్డకు సురక్షితమైన ఉత్పత్తులు దొరకకపోవడం ఆమెను బాధించింది. కానీ అదే బాధ ఒక గొప్ప ఆలోచనకు దారి తీసింది. “నా బిడ్డకు లేనిది, మరెందరికో కూడా లేదు” అన్న ఆలోచనతో Mamaearth పుట్టింది. ఆమె ప్రయాణం అంత సులభంగా పూర్తి కాలేదు. కేవలం 25 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ, నేడు టాక్సిన్-ఫ్రీ, పర్యావరణహిత ఉత్పత్తులలో అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగింది.
ఇది కూడా చదవండి: Tata Motors: ఈ టాటా కారు కొత్త రికార్డు.. 29 కి.మీ మైలేజీ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు!
ఎన్నో సందేహాలు, భయాలు, అపజయాలు అన్నీ ఎదురయ్యాయి. అయినా గజల్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ ముఖ్యం అని నమ్మారు. ప్రతి రోజూ ఒక చిన్న ముందడుగు వేయడమే ఆమె విజయ రహస్యం. నేడు Mamaearth మార్కెట్ విలువ సుమారు 8,352 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది భారతదేశంలోని ప్రముఖ D2C బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. గజల్ కొత్త తరం వారికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఫోర్బ్స్ 2022 ఆసియా పవర్ బిజినెస్‌వుమెన్ లిస్టులో చోటు దక్కడం సహా అనేక అవార్డులు ఆమె కృషికి నిదర్శనం.
ఈ రోజు Mamaearth వేల కోట్ల విలువైన బ్రాండ్. కానీ గజల్‌కు ఇది కేవలం వ్యాపారం కాదు. ఒక ఉద్దేశం. టాక్సిన్-ఫ్రీ ఉత్పత్తులు, పర్యావరణ పరిరక్షణ, కొత్త తరం వ్యాపారులకు మార్గదర్శనం ఇవన్నీ ఆమె లక్ష్యంలో భాగమే. నమ్మకమే ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది బలంగా నమ్మేవారు. సమస్యలకు భయపడవద్దని, ఏదైనా వ్యాపారం చిన్నగా మొదలుపెట్టడాన్ని అవమానంగా భావించవద్దని, అలాంటి అనుభవాల ద్వారానే బలంగా మారుతారని చెప్పేవారు. ఎందుకంటే ఒక సాధారణ ఆలోచన కూడా సరైన ఉద్దేశంతో ముందుకు సాగితే అసాధారణ విజయంగా మారగలదని నిరూపించారు.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి