Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!

Success Story: చదివింది కవేలం 6వ తరగతి. కానీ వినూత్న ఆలోచనతో తన వ్యాపారంలో ముందుకు సాగుతున్నాడు ఓ వ్యక్తి. వ్యాపారం చేయాలంటే చదువే ముఖ్యం కాదని, ఏదైనా సాధించాలనే ఆలోచన ఉంటే చాలా చెబుతున్నాడు. పెద్దగా చదువు లేకపోయినా తన వ్యాపారంతో మంచి సంపాదన వస్తుందని అంటున్నాడు..

Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!

Updated on: Dec 08, 2025 | 1:08 PM

Success Story: తన బైక్‌పై ప్రయాణించి తన వ్యాపారాన్ని నడిపే ఒక యువకుడి విజయగాథ గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారం గణనీయమైన లాభాలను తెచ్చి పెడుతుంది. నిజానికి, 20 ఏళ్ల గోరేలాల్ ఇంటింటికీ వెళ్లి మహిళల జుట్టు నుంచి ఊడిపోయిన వెంట్రులకు కొనుగోలు చేయడమే. మహిళల జుట్టు నుంచి ఊడిపోయిన వెంట్రుకలను కొనుగోలు చేసి వారికి కిచెక్‌ను సంబంధించిన ఏదైనా వస్తువు ఇస్తుంటాడు. ఈ వ్యాపారం గోరేలాల్‌కు గణనీయమైన లాభాలను తెచ్చి పెట్టింది. అతను ప్రయాణించడం ద్వారా ప్రతిరోజూ 800 నుండి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నాడట. అయితే కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నాడు అతను చెబుతున్నాడు.

అయితే తనకు చదువు పెద్దగా లేదని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నివాసి అయిన 20 ఏళ్ల గోరేలాల్ చెప్పారు, “కానీ నేను ఈ వ్యాపారంలో చాలా కష్టపడుతున్నాను. నేను ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. ఆ తర్వాత, నేను ఈ వ్యాపారంలో చేరాను. ఈ వృత్తిని నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు గడిపాను. ఇప్పుడు బైక్‌పై వెళ్లి మహిళల జుట్టును సేకరించి డబ్బులు సంపాదిస్తున్నానని చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: RBI: జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

ఇవి కూడా చదవండి

ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంది. అందుకే నేను వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాను. ఎక్కడైనా మహిళల జుట్టు దొరికితే, మేము క్యాంపు ఏర్పాటు చేస్తాము. అంటే మేము ఒక గదిని అద్దెకు తీసుకుని నెలల తరబడి అక్కడే నివసిస్తాము. మా వ్యాపారం చేసుకుంటాము. ప్రస్తుతం మేము ఛతర్‌పూర్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ మహిళల వెంట్రుకలను సేకరిస్తున్నాము అని చెప్పాడు.

రూ.4,000 చొప్పున ఊడిన జుట్టును కొనుగోలు చేస్తానని వివరించాడు . గృహోపకరణాలలో ఎక్కువ భాగం మహిళలే కొనుగోలు చేస్తారు. అందుకే అతను తనతో పాటు వంటకు సంబంధించిన పాత్రలను కూడా తీసుకువెళతాడు. అయితే కొన్ని గ్రామాలలో చాలా రోజులు ఉండి జుట్టును సేకరిస్తుంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయని, తన జీవనం కోసం ఎంత దూరమైనా వెళ్లి డబ్బులు సంపాదించుకుంటానని చెబుతున్నాడు. ముందుగా చదువు లేదని బాధపడేవాడినని, కానీ  మంచి ఆలోచనతో ఏదైనా చిన్న పాటి  వ్యాపారంతో ముందుకు సాగి డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నాడు. డబ్బులు సంపాదించాలంటే చదువే ముఖ్యం కాదని, కష్టపడితే ఏదైనా సాధ్యమని చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: Anant Ambani Watch: అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి