Stock Markets: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో క్షీణత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో భయానక వాతావరణం నెలకొంది. అయితే, నిపుణులు దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని మంచి స్టాక్స్‌లో మదుపు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఎలా చేస్తే స్టాక్ మార్కెట్ నష్టాలను తప్పించుకోగలం అనే విషయాన్ని నిపుణులు ఇలా సూచిస్తున్నారు.
మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సరైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ఈ సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), బ్యాంకింగ్, లాజిస్టిక్స్ రంగానికి చెందిన స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టడం సరైనదని వారు అభిప్రాయపడుతున్నారు.
SIP ద్వారా పెట్టుబడి పెట్టండి
స్టాక్ మార్కెట్ దాని ఎగువ స్థాయిల నుండి చాలా పడిపోయింది. అయితే ఇప్పటికీ, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, వారు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా వాయిదాలలో దీన్ని చేయాలి. ఇది స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అస్థిరత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాస్త ఓపిక పడితే పడిపోతున్న మార్కెట్‌లో కూడా లాభాలను ఆర్జించవచ్చు. అని నిపుణులు అంటున్నారు.
స్టాక్ బాస్కెట్..
నిపుణులు ఇంకా ఏమంటున్నారంటే..”ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో స్టాక్ బాస్కెట్ అనే భావన కొనసాగుతోంది. దీని కింద, మీరు మంచివి అనుకున్న 5 కంపెనీల షేర్ల బుట్ట(బాస్కెట్)ను సృష్టించండి. అందులోని అన్ని షేర్లలో మీ పెట్టుబడి పెట్టండి. అంటే, మీరు మొత్తం 25 వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ 5 షేర్లలో సమానంగా ఐదేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది.” అని వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..
83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’
Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..