దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 83.88 పాయింట్లు లాభపడి 37,481.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.40 పాయింట్లు లాభపడి 11,113.80 వద్ద ముగిసింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్, హీరోమోటోకార్ప్, టాటాస్టీల్, ఐఓసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ కంపెనీ భారీ నష్టాలను చవిచూశాయి. 1134 కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవ్వగా.. 1333 కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. కాగా, 137 కంపెనీల షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇక కాఫీడే మాతృసంస్థ సీడీఈ షేర్లు నేడు కూడా మరో 20శాతం కుంగి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.