Stock market – Heranba Industries: స్టాక్ మార్కెట్లో హెరన్బా ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గతంలో చాలామేర నష్టాల్లో ఉన్న షేర్లు.. ఇప్పుడు పరుగులు పెడుతుండటంతో పెట్టుబడిదారులందరూ వాటివైపే చూస్తున్నారు. నష్టాల్లో ఉన్న హెరన్బా షేర్లు ఒక్కొక్కటి ఈ రోజు 50.7 లాభాలతో.. గరిష్ట స్థాయి 945 రూపాయలకు పెరిగాయి. అయితే ఈ షేర్ మార్చి 5న ప్రారంభ ధర రూ.900 మాత్రమే ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక షేర్ ధర 44 శాతం ప్రీమియం జాబితాలోకి వెళ్లింది. మార్కెట్ ఈ రోజు మందగమనంగా ఉన్నప్పటికీ హెరన్బా ఇండస్ట్రీస్ దూసుకువెళ్లింది. బిఎస్ఇ అంచనా ప్రకారం.. 32.08 శాతం పెరిగి 828.15 రూపాయల వద్ద ముగిసింది.
ఇతర లిస్టెడ్ కంపెనీలతో పోల్చితే.. హెరన్బా ఐపిఓ విలువలు భవిష్యత్ వ్యాపార వృద్ధిని రక్షించే విధంగా ఉన్నాయని.. భారత మార్కెట్లో సింథటిక్ పైరెథ్రాయిడ్ల ఉత్పత్తిలో కంపెనీ 19.5 శాతంతో ప్రముఖంగా ఉందని మెహతా ఈక్విటీస్‌లోని ఎవిపి రీసెర్చర్ ప్రశాంత్ తాప్సే అన్నారు. ప్రపంచ, దేశీయ ఆహార డిమాండ్, ఉత్పత్తి పెరుగుదల అనుగుణంగా.. హెరాన్బా షెర్లు పెరిగినట్లు తాప్సే వివరించారు. పెట్టుబడిదారులు పాక్షిక లాభాలతోపాటు.. దీర్ఘకాలిక వాటాల కోసం అన్వేషిస్తున్నారన్నారు.
గుజరాత్‌కు చెందిన హెరాన్బా ఇండస్ట్రీస్ పంటను రక్షించే రసాయనాలను తయారు చేస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే రసాయానాల్లో పురుగుమందులు, కలుపు సంహారకాలు, శిలీంద్రనాశకాలను నాశనం చేసే క్రిమిసంహారిక మందులున్నాయి. అయితే ప్రస్తుతం షెర్లు ఒక్కసారిగా పెరగడానికి కూడా కారణం ఇదే. కావున ఇన్వెస్టర్లు హెరాన్బాలో పెట్టుబడులు పెట్టాలంటే.. 800-850 రూపాయలకు ఒక్కొక్క షేర్ కొనుగోలు చేయవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: