SBI Loans: బ్యాంకింగ్ రంగలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. బ్యాంక కస్టమర్లకు సులభమైన సేవలు అందించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పలు మైక్రోఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కో-లెండింగ్ కోసం బ్యాంక్ ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో జతకట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రుణాలు అందుబాటులోకి రానున్నాయి.
వేదిక క్రెడిట్ క్యాపిటల్, సేవ్ మైక్రోఫైనాన్స్, పైసాలో డిజిటల్ అనే మూడు మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో ఎస్‌బీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌బీఐ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. చాలా మందికి చిన్న మొత్తంలో రుణాలు సులభంగా లభించనున్నాయి.
ఫామ్ మెకనైజేషన్, వేర్‌హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటి వాటికి రుణాలు అందించేందుకు బ్యాంక్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల భాగస్వామ్యంతో ఎస్‌బీఐ రుణాలు వీరికి అందుబాటులోకి రానున్నాయి. ఇలా కస్టమర్ల కోసం ఎస్‌బీఐ ఎన్నో సదుపాయాలు తీసుకువస్తోంది. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, సీనియర్ సిటిజన్స్ కోసం రుణాలు తదితర అంశాలలో ఎన్నో సదుపాయాలను అందిస్తోంది. ఇవే కాకుండా హోమ్ లోన్స్‌పై కూడా వడ్డీ శాతం కూడా తగ్గిస్తోంది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎస్‌బీఐ మార్పులు తీసుకువస్తోంది.