
మీరు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కష్టపడాలని అనుకుంటే ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అవుతుంది. ఇంతకీ బిజినెస్ ఏంటంటే. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద భూమి, డబ్బు లేదా అనుభవం అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని 300–400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఉచిత శిక్షణా కోర్సులు, వ్యవసాయ శాస్త్ర కేంద్రాల నుండి సహాయం, ప్రభుత్వ రుణాలు వంటి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మీకు సరైన విత్తనాలు, సాగు, నిర్వహణ తెలిస్తే చాలు మంచి లాభం పొందవచ్చు.
ఈ రోజుల్లో మహిళలు ఇంటి నుండే చేయగలిగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలను సాధించిన ఉత్తమ వ్యాపారాలలో ఒకటి పుట్టగొడుగుల పెంపకం. ఈ వ్యాపారం గురించి ప్రత్యేకత ఏమిటంటే దీనిని రూ.10,000 పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ.60,000 నుండి రూ.80,000 వరకు ఆదాయం పొందవచ్చు.
పుట్టగొడుగుల పెంపకంలో ఆయిస్టర్ మష్రూమ్, మిల్క్ మష్రూమ్ వంటి అనేక రకాలు ఉన్నాయి. దీనికి ఇంటి వంట, హోటళ్ళు, మార్కెట్లలో అధిక డిమాండ్ ఉంది. ఒక కిలో పుట్టగొడుగు రూ.200 వరకు ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఒక చిన్న పొలం రోజుకు 15–20 కిలోల వరకు ఉత్పత్తి చేయగలదు. అలా లెక్కించినట్లయితే రోజుకు రూ.3,000 నుంచి 4,000 ఆదాయం, నెలకు రూ.70,000 నుంచి 1,00,000 ఆదాయం పొందవచ్చు. ఈ వ్యాపారంలో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఒకవైపు ఇంటి పనులు చూసుకుంటూనే మరోవైపు పుట్టగొడుగుల పెంపకం చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి