Tata Neu: మరో విభాగంలో అడుగు పెట్టిన టాటా డిజిటల్‌.. సేవింగ్స్ ​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్

|

Jan 09, 2025 | 6:30 PM

Tata Neu: టాటా న్యూ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మార్కెట్‌ప్లేస్‌కు ప్రత్యేకత ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ ప్రక్రియ. కస్టమర్‌లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను పూర్తిగా ఆన్‌లైన్‌లో కేవలం 10 నిమిషాల్లో తెరవవచ్చు. లిక్విడేట్ చేయవచ్చు. ఇది ఎఫ్‌డీ వినియోగదారులకు ఉపయోగరంగా..

Tata Neu: మరో విభాగంలో అడుగు పెట్టిన టాటా డిజిటల్‌.. సేవింగ్స్ ​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్
Follow us on

దేశంలోనే అత్యంత విశ్వసనీయ కంపెనీల్లో టాటా గ్రూప్ ఒకటి. ఇక మార్కెట్ విలువ పరంగా కూడా దేశంలోనే ఇదే అతిపెద్ద సంస్థ అనే చెప్పవచ్చు. తాజాగా టాటా ఓ కీలక ప్రకటన చేసింది. చిప్పుడు చిన్న మొత్తాల పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెట్టినట్లు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన టాటా డిజిటల్ తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం టాటా న్యూ సూపర్ యాప్‌లో ఒక విభాగం ప్రారంభించినట్లు వెల్లడించింది. దీని ద్వారా ప్రముఖ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు- NBFC) వద్ద ఇన్వెస్టర్లకు గరిష్టంగా 9.10 శాతం వరకు వడ్డీ రేటు పొందేలా ఎఫ్‌డీ చేయవచ్చని సంస్థ తెలిపింది. ప్రముఖ ఆర్థిక సంస్థలతో పాటు రూ. 1,000 నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.

కేవలం 10 నిమిషాల్లో సురక్షిత FD బుకింగ్:

టాటా న్యూ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మార్కెట్‌ప్లేస్‌కు ప్రత్యేకత ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ ప్రక్రియ. కస్టమర్‌లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను పూర్తిగా ఆన్‌లైన్‌లో కేవలం 10 నిమిషాల్లో తెరవవచ్చు. లిక్విడేట్ చేయవచ్చు. ఇది ఎఫ్‌డీ వినియోగదారులకు ఉపయోగరంగా ఉంటుంది. ఇది ఎఫ్‌డీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన రాత పని, బ్యాంకులను సందర్శించే ఇబ్బందులు తప్పుతాయి.

కస్టమర్‌లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరవకుండానే ఎఫ్‌డిపై 9.1 శాతం వరకు వడ్డీ రేట్లను పొందవచ్చు. ICRA, CARE, CRISIL వంటి అనేక రేటింగ్ ఏజెన్సీలు కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను మూల్యాంకనం చేసి, దాని ఆధారంగా రేటింగ్‌లు ఇస్తాయి.

5 లక్షల వరకు పెట్టుబడికి గ్యారంటీ

దీని ద్వారా అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, కొత్త వ్యక్తులు సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చని టాటా డిజిటల్ చెబుతోంది. కస్టమర్లు కనీసం రూ.1,000 ఎఫ్‌డీ చేయగలరని కంపెనీ తెలిపింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వారు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) ద్వారా రూ. 5 లక్షల వరకు బ్యాంకు పెట్టుబడికి బీమా కూడా పొందుతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ మార్కెట్‌ప్లేస్‌తో విశ్వసనీయ ప్రొవైడర్ల నుండి అధిక వడ్డీ రేట్లను అందించడం ద్వారా సామాన్యులకు ఫిక్స్‌డ్-రిటర్న్‌ల వంటి ఆర్థిక ఉత్పత్తుల పరిధిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ తెలిపింది.

విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్‌తో సహా పలు విశ్వసనీయ బ్యాంకులు, NBFCల నుండి ప్లాట్‌ఫారమ్ FDలను అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసిన పెట్టుబడులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద INR 5 లక్షల వరకు బీమా చేయబడుతుంది. ఇది కస్టమర్‌లకు భద్రత కల్పిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి