
చాలా మందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటుంది. ఈ కాలంలో చాలీచాలని జీతంతో ఉద్యోగం చేసేకంటే ఏదో ఒక చిన్నదో పెద్దదో సొంత వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అని యువత కూడా ఆలోచిస్తుంది. అయితే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా.. ఏ వ్యాపారం చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? ఎంత పెట్టుబడి కావాలి అనే సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండే వారికి.. ఊర్లో ఏం బిజినెస్ నడుస్తుందిలే అని అనుకుంటారు.
కానీ, ఉన్న ఊర్లోనే తక్కువ టైమ్ పనిచేస్తూ.. మంచి సంపాదన ఉండే ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రస్తుతం నాన్‌వెజ్ తినే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు కూడా నాన్‌వెజ్ అమ్మకాలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. కేవలం సండేనే కాకుండా రెండు రోజులకు ఒకసారి నాన్‌వెజ్ తినేవారు పెరిగిపోతున్నారు. ఇప్పుడు నాన్‌వెజ్‌కు పెరుగుతున్న ఈ డిమాండ్‌నే మీ బిజినెస్‌గా మార్చుకోవచ్చు.
చిన్న పల్లెటూర్లో కూడా ఒక చికెన్ సెంటర్ పెట్టుకుని మంచి ఆదాయం పొందవచ్చు. పైగా ఈ చికెన్ సెంటర్‌లో ఎక్కువ టైమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం ఓ మూడు గంటలు, సాయంత్రం ఓ మూడు గంటలు షాప్ తెరిస్తే చాలు. మధ్యలో వేరే పని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే.. ఊర్లలో జనం అంతా వ్యవసాయ పనులకు వెళ్లిపోతారు. ఉదయం, సాయంత్రం మాత్రమే జనం ఊర్లో కనిపిస్తారు. అప్పుడే గిరాకీ కూడా ఉంటుంది. సో.. రెండో ఆదాయ వనరుగా చికెన్ సెంటర్ మారుతుంది. పైగా బాయిలర్ కోళ్లతో పాటే నాటు కోళ్లు కూడా అమ్మితే మంచి లాభాలు చూడొచ్చు. పైగా అతి తక్కువ పెట్టుబడితో ఒక చిన్న షెడ్ వేసుకొని, ఒక మొద్దు, ఒక పెద్ద కత్తి ఉంటే చాలు బిజినెస్ మొదలుపెట్టొచ్చు. వ్యాపారం పెరిగితే కోళ్లను శుభ్రం చేసే మెషిన్ ఒకటి అవసరం అవుతుంది. జస్ట్ రూ.5 వేలతోనే చికెన్ సెంటర్‌ను స్టార్ట్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.