AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.5 వేలు వచ్చే బిజినెస్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీ కోసమే..

తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యాపారం చేయాలనుకుంటున్నారా? కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్ బిజినెస్ మీకు సరైన ఎంపిక. కీచైన్‌ లు, మగ్‌లు, టీ-షర్టులపై ఫోటో ప్రింటింగ్‌తో సహా అనేక రకాల వ్యక్తిగతీకరించిన బహుమతులు అందించడం ద్వారా రోజుకు రూ. 5000 వరకు సంపాదించవచ్చు.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.5 వేలు వచ్చే బిజినెస్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీ కోసమే..
SN Pasha
|

Updated on: Nov 14, 2025 | 7:45 AM

Share

తక్కువ పెట్టుబడి తోనే మంచి బిజినెస్ చేయాలి అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, ఏ బిజినెస్‌ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? అసలు సక్సెస్‌ అవుతామా లేదా అనే డౌట్‌ ఉంటుంది. కానీ, పట్టుదలతో ప్రయత్నిస్తే వ్యాపారంలో కూడా రాణించవచ్చు. అయితే తక్కువ పెట్టుబడితో చేసే ఒక బిజినెస్‌ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు గరిష్టంగా ప్రతిరోజు 5000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. మార్కెట్ డిమాండ్ ను బట్టి మీకు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది.

ఇంతకీ బిజినెస్ ఏంటంటే.. కష్టమైజ్డ్ గిఫ్ట్ షాప్. కీచైన్, కాఫీ మగ్, టీ షర్టు, పిల్లో కవర్ లపై ఫొటో ప్రిండింగ్‌, త్రీడీ రియాలిటీ టాయ్ వంటి వస్తువులను మీకు నచ్చినట్లుగా డిజైన్ చేయించి కష్టమైజ్డ్ గిఫ్ట్ షాప్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ బిజినెస్ కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మంచి ట్రెండీ బిజినెస్ అని చెప్పవచ్చు. అతి తక్కువ పెట్టుబడి తోనే మీరు ఈ రంగంలో రాణించవచ్చు. దీనికి కావలసినవి కలర్ ప్రింటర్స్, మగ్ – కీచైన్ హిట్ ప్రెస్, టీషర్టు హీట్ ప్రెస్, వినైల్ గ్లాసెస్ స్టిక్కర్ షీట్స్ అవసరం అవుతాయి. ఇక కంప్యూటర్ ఉన్నట్లయితే అందులో మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసిన అనంతరం కలర్ ఇంకు జట్టు ప్రింటర్ ద్వారా మీకు కావాల్సిన ఫోటోను వినైల్ స్టిక్కర్ పై ప్రింట్ అవుట్ తీసుకొని. దాన్ని హీట్ ప్రెస్ ద్వారా కీ చైన్ పైన కానీ, కాఫీ మగ్గు పైన కానీ, లేదా టీ షర్టు పైన కానీ, పిల్లో కవర్స్ పైన కానీ ఫోన్ బ్యాక్ కవర్ల పైన కానీ స్టిక్కరింగ్ చేసి విక్రయించినట్లయితే, చక్కటి ఆదాయం పొందవచ్చు.

ఈ మధ్యకాలం యూత్‌ ఎక్కువగా ఇలాంటి కష్టమైస్ గిఫ్టులను తమ ప్రియమైన వారికి ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. పెళ్లి రోజులు, పుట్టినరోజు, ప్రేమికుల రోజు ఇలా అనేక సందర్భాల్లో ఇలాంటి గిఫ్ట్స్‌ బాగా సేల్‌ అవుతూ ఉంటాయి. ఈ బిజినెస్ ప్రారంభించడానికి కనీస పెట్టుబడి 50 వేల రూపాయల వరకు పెట్టుకోవచ్చు. ఇక లాభం విషయానికి వచ్చినట్లయితే, ఒక కాఫీ మగ్గు పైన ప్రింట్ చేసి విక్రయించినట్లయితే మీకు పెట్టుబడి కాఫీ మగ్గుతో సహా కలిపి సుమారు రూ.70 నుంచి రూ.90 వరకు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మీరు రూ.200 నుంచి రూ.250 విక్రయించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి