SpiceJet: ఆకాశంలో ఆన్‌లైన్ షాపింగ్‌.. మీ ఇష్టమైన వస్తువులు కొనొచ్చు.. ఎలాగంటే..

|

Jun 16, 2022 | 7:25 AM

ఇప్పుడు మీరు ఫ్లైట్‌లో వేల అడుగుల ఎత్తులో కూడా హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటరా.. జీ బిజినెస్ నివేదిక ప్రకారం, బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ స్కై మాల్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది.

SpiceJet: ఆకాశంలో ఆన్‌లైన్ షాపింగ్‌.. మీ ఇష్టమైన వస్తువులు కొనొచ్చు.. ఎలాగంటే..
Follow us on

ఇప్పుడు మీరు ఫ్లైట్‌లో వేల అడుగుల ఎత్తులో కూడా హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటరా.. జీ బిజినెస్ నివేదిక ప్రకారం, బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ స్కై మాల్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. స్కై మాల్ స్పైస్‌జెట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ స్పైస్ స్క్రీన్‌లో ఉంటుంది. విమానంలో ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. ఈ స్కై మాల్ స్నాప్‌డీల్ సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రయాణికులు ప్రయాణంలో బట్టలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సౌందర్య సాధనాలతో సహా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేయ్యొచ్చు. దేశీయ విమానయాన పరిశ్రమలో తొలిసారిగా ఈ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. స్పైస్‌జెట్ ప్రకారం దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని దేశీయ విమానాల ప్రయాణీకులు ఇప్పుడు సిస్టమ్‌లో అందించిన ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ ఉపకరణాలు, దుస్తులు నుంచి హెడ్‌ఫోన్‌లు, మొబైల్ ఛార్జర్‌ల నుంచి ఎంచుకోవచ్చు.

ఫ్లైట్ సమయంలో వస్తువులను ఎంచుకుని, ఆర్డర్ చేసినప్పుడు, షిప్ దిగిన వెంటనే ఆర్డర్ కంపెనీలకు పంపుతారు. ఈ వస్తువు భారతదేశంలో ఎక్కడైనా హోమ్ డెలివరీ చేస్తారు. స్నాప్‌డీల్ ప్రకారం ఈ ఫీచర్‌తో ప్రయాణించే ప్రయాణీకులు తమ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అవసరమైన కొనుగోళ్లను చేయగలుగుతారు. ఇప్పటికే పవర్‌లో ఉన్న స్పైస్‌స్క్రీన్ సహాయంతో ఈ ఫీచర్ ప్రయాణికులకు అందిస్తున్నారు. స్పైస్‌జెట్ ప్రయాణీకుల కోసం విమానయాన సంస్థలు స్పైస్‌స్క్రీన్ సేవను అందిస్తాయి. దేశీయ స్టార్టప్‌తో కలిసి స్పైస్‌జెట్ దీన్ని తయారు చేసింది. ఇదొక వైర్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్. తద్వారా ప్రయాణికులు తమ సొంత పరికరం సహాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. విమానంలోని ప్రయాణీకులు ప్రయాణంలో Wi-Fi నెట్‌వర్క్ ద్వారా వారి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలో కంటెంట్‌ను పొందవచ్చు.