SpiceJet: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై EMI పద్దతిలో విమాన టిక్కెట్లు!

|

Nov 08, 2021 | 4:04 PM

సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉన్న విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చేందుక విమాన సర్వీసు సంస్థలు ఫ్లాన్ చేస్తున్నాయి.

SpiceJet: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై EMI పద్దతిలో విమాన టిక్కెట్లు!
Spicejet
Follow us on

SpiceJet Fly Tickets: సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉన్న విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చేందుక విమాన సర్వీసు సంస్థలు ఫ్లాన్ చేస్తున్నాయి. విహంగ విహారం చేయాలంటే అత్యధిక ఛార్జీలు వెచ్చించాల్సిందే. అయితే, అలాంటి కష్టాలను తీర్చడం కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్‌, రీటైల్‌, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్‌ జెట్‌ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.

విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్‌ ఫ్లైట్‌ టికెట్లను కొనుగోలు చేయొచ్చని ఆసంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చని వెల్లడించింది.

ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ధ్రువీకరణ నిమిత్తం పాన్‌ కార్డు, ఆధార్‌, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్‌ అవుతాయి. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్‌ జెట్‌ పేర్కొంది.

Read Also…  Pattabhiram: వైసీపీ ప్రభుత్వం తప్పిదాలను ఆధారాలతో సహా బయటపెడతాంః టీడీపీ నేత పట్టాభి