Telugu News Business South Central Railway Sankranti Special Trains: Secunderabad Srikakulam Routes and Dates Announced
Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Sankranthi Special Trains 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెరగనున్న రద్దీ, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించుకుంది. పండుగకు ప్రయాణికులు జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఉద్దేశంతో.. ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. పండగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రతి ప్రయాణికులు ఈ ప్రత్యేక రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం.. సికింద్రాబాద్ – శ్రీకాకుళం మధ్య 07288, 07289 నంబర్ గల రెండు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో ప్రయాణికుల అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 12,30కు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇక సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య నడిచే 07290/07291 నంబర్ గల మరో రెండు రైళ్లు జనవరి 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రైన్ సాయంత్రం 3.30కు బయల్దేరి మరుసటి రోజు 8:10 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
దీంతో పాటు శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07295 నెంబర్ గల ట్రైన్ జనవరి 14వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:10 నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
అలాగే సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య రాకపోకలు సాగించే 07292 నంబర్ గల రైలు జనవరి 17వ తేదీన కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇక శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07293 నంబర్ గల రైలు జనవరి 18వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.ఈ ట్రైన్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:10 నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
ఇక చివరగా వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు మధ్య రాకపోకలు సాగించే 07294 నంబర్ గల రైలు జనవరి 13వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని.. ఇది రాత్రి 7:15 నిమిషాలకు బయల్దేరి.. ఇవి రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్‌ల గుండా మరుసటి రోజు మధ్యా మధ్యాహ్నం 12:30కు శ్రీకాకుం రోడ్డుకు చేరుకుంటుంది.
మరిన్ని వివరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి