Petrol Price Hike: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సెగ భారత్‌ను ఏ రేంజ్‌లో తాకబోతోందో చెప్పే బ్రేకింగ్ ఇది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రో రేట్ల సవరింపు లేదుగానీ.. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలపై రివ్యూ(Price Review) జరిగితే లీటర్ పెట్రోల్ 150 నుంచి 180 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో క్రూడ్ ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. మరో నెలలో ఇది 140 డాలర్లకూ చేరొచ్చన్నది అంచనా. అంటే మన దగ్గర మార్చి 7న ఎన్నికలు కాగానే.. 8న కచ్చితంగా పెట్రోల్ ధరల రివ్యూ ఉంటుంది. అప్పటికి క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుంది. సో.. ఆ రోజుకు అంచనా లీటర్ పెట్రోల్ 2వందలకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నది తాజా లెక్కలు చెబుతున్న సత్యం.
2020 కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో లాక్ డౌన్ కారణంగా క్రూడ్ ధరలు భారీగా పతనమై బ్యారెల్ ధర 9.2 డాలర్ల కనిష్ఠాన్ని తాకింది. కానీ.. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రభావంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 7శాతం మేర పెరిగాయి. తద్వారా 18 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో క్రూడ్ బారెల్ ధర బ్యారెల్ అత్యధికంగా 143.95 డాలర్ల మార్కును తాకింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. అంతర్జాతీ మార్కెట్లో ముడి చమురు ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 111 డాలర్లకు ఎగబాకింది. డబ్ల్యూటీఐ కూడా 5శాతం పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లు దాటింది.
ప్రస్తుతం డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్‌తో పాటు ఐఈఏ సభ్య దేశాలు తమ వద్ద ఉన్న నిల్వల నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఐతే ఒక రోజు చమురు వినియోగంతో పోల్చితే ఇది చాలా తక్కువ. రానున్న ఒక్క నెలలోనే ఈ చమురు ధర బ్యారెల్ 140 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా భారత్ లో ముడి చమురు ధరలు రాబోయే రోజుల్లో 150 డాలర్లు దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా తక్కువ ధరకే చమురును అందించినా.. అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కారణంగా ఎవరూ కొనుగోలు చేయడం లేదు.
ఇవీ చదవండి..
Market Update: మళ్లీ మెుదటికి.. యుద్ధ భయాల్లో మార్కెట్లు.. ఆరంభంలోనే పతనం..
Investment Plan: ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి..