ప్రధాని మోదీ అడుగుపెట్టిన వేళా.. భారత్‌లో సింగపూర్ క్యాపిటా ల్యాండ్ భారీగా పెట్టుబడులు..!

|

Sep 04, 2024 | 1:16 PM

ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ సంస్థ సింగపూర్‌కు చెందిన క్యాపిటా ల్యాండ్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2028 నాటికి భారతదేశ నిర్మాణ రంగంలో తమ వాటాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో 7.4 బిలియన్ సింగపూర్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులను 2028 నాటికి భారతదేశంలో నిర్వహణలో ఉన్న నిధులను 14.8 బిలియన్ సింగపూర్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 90,280 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. భారత్‌లో తమ పెట్టుబడులు […]

ప్రధాని మోదీ అడుగుపెట్టిన వేళా.. భారత్‌లో సింగపూర్ క్యాపిటా ల్యాండ్ భారీగా పెట్టుబడులు..!
Capital Land
Follow us on

ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ సంస్థ సింగపూర్‌కు చెందిన క్యాపిటా ల్యాండ్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2028 నాటికి భారతదేశ నిర్మాణ రంగంలో తమ వాటాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో 7.4 బిలియన్ సింగపూర్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులను 2028 నాటికి భారతదేశంలో నిర్వహణలో ఉన్న నిధులను 14.8 బిలియన్ సింగపూర్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 90,280 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.

భారత్‌లో తమ పెట్టుబడులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ సిఈవో లీ చీ కూన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2028 నాటికి 200 బిలియన్ సింగపూర్ డాలర్ల FUMను సాధించాలనే కంపెనీ ప్రపంచ లక్ష్యానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. నాణ్యమైన రియల్ నిర్మాణాల కోసం గ్లోబల్ కార్పొరేషన్లు, సంస్థాగత పెట్టుబడిదారుల నుండి భారత్ ఆకర్షిస్తోందని గ్రూప్ సీఈవో లీ చీ కూన్ అన్నారు. భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం, రియల్ ఎస్టేట్ ప్రైవేట్ క్రెడిట్ విభాగాల్లోకి ప్రవేశించడానికి అవకాశాలను తమ కంపెనీ అన్వేషిస్తుందని కూన్ తెలిపారు.

క్యాపిటాల్యాండ్ ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ గ్రూపులలో ఒకటి. సింగపూర్‌ కేంద్రంగా పని చేసే క్యాపిటాల్యాండ్, పోర్ట్‌ఫోలియో కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్, పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ వంటి అనేక రకాల రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తరించి ఉంది. వాణిజ్య సముదాయాలు, పట్టణాభివృద్ధి, సర్వీస్ అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లు, దీర్ఘకాలిక అద్దె అపార్ట్‌మెంట్‌లు, నివాస భవనాలు నాణ్యమైన నిర్మాణాలు చేపడుతోంది. 30కి పైగా దేశాల్లోని 240 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించింది క్యాపిటాల్యాండ్. దాని ప్రధాన మార్కెట్‌లుగా సింగపూర్, చైనాలపై దృష్టి సారిస్తుంది. అయితే ఇది భారతదేశం, వియత్నాం, ఆస్ట్రేలియా, యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి మార్కెట్‌లలోకి మెల్ల మెల్లగా విస్తరిస్తూనే ఉంది. ఇదిలావుంటే, గత నెలలో, కంపెనీ భారతదేశంలో బిజినెస్ పార్క్ అభివృద్ధి కోసం ఒక నిధిని ప్రారంభించింది. ఇది నిర్వహణలో ఉన్న దాని నిధులకు 700 మిలియన్ సింగపూర్ డాలర్ల నిధులను విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..