BSNL Recharge: నమ్మలేని వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్.. ఇక సిమ్ ఇన్‌యాక్టివ్ అవ్వదంతే..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వాడకం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి ఫోన్ రెండు సిమ్‌లు ఉండడం పరిపాటిగా మారింది. అయితే రెండు సిమ్స్ యాక్టివేట్‌లో ఉంచుకునేందుకు రీచార్జ్ చేయాల్సి వస్తుంది. అయితే తాజాగా బీఎస్‌ఎన్ఎల్ తక్కువ ధరకే ఇలాంటి రీచార్జి ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

BSNL Recharge: నమ్మలేని వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్.. ఇక సిమ్ ఇన్‌యాక్టివ్ అవ్వదంతే..!

Updated on: Jun 19, 2025 | 2:49 PM

భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంటికి మొబైల్ కనెక్షన్ చేరుకుంది. మనలో చాలా మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. చాలా మందికి జియో, ఎయిర్‌టెల్, వీఐలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్ కూడా ఉంది. మీరు మీ బిఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే తక్కువ ఖర్చుతో బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచగలిగేలా ఉత్తమమైన రీఛార్జ్ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. బీఎస్ఎన్ఎల్ రూ.197 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తక్కువ ధరకే నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారు ఈ ప్లాన్‌లో 15 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోమింగ్ సేవలను పొందవచ్చు. 

ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ పోర్ట్‌ఫోలియోలో అనేక ప్లాన్‌లు ఉన్నాయి. కంపెనీ తన కస్టమర్ల సౌలభ్యం కోసం విభిన్న ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 197 ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో రావడమే కాకుండా ఇన్‌కమింగ్ సౌకర్యం కూడా కొనసాగుతుంది. ఈ ప్లాన్‌ ద్వారా 15 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోమింగ్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే 2 జీబీ అపరిమిత డేటా కూడా 15 రోజుల పాటు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. 2 జీబీ డేటా అయిపోయిన తర్వాత వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. దీనితో పాటు, 15 రోజుల పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

15 రోజుల తర్వాత లోకల్ కాలింగ్‌కు నిమిషానికి రూ.1, ఎస్‌టీడీ కాలింగ్‌కు నిమిషానికి రూ.1.3 ఖర్చవుతుంది. వీడియో కాలింగ్ కోసం మీరు లోకల్, నేషనల్ కోసం నిమిషానికి రూ.2 చెల్లించాలి. ఎస్ఎంఎస్ విషయానికి వస్తే ప్రతి ఎస్ఎంఎస్‌కు 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.20 చెల్లించాల్సి వస్తుంది. ఉచిత డేటా ముగిసిన తర్వాత మీరు ప్రతి ఎంబీకి 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..