Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. ఇవాళ మార్కెట్లో కిలో వెండి ధర ఎంతంటే..

|

Feb 10, 2021 | 7:51 AM

అటు దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతుంటే.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. సిల్వర్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి.

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. ఇవాళ మార్కెట్లో కిలో వెండి ధర ఎంతంటే..
Follow us on

అటు దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతుంటే.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. సిల్వర్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం కిలో వెండి ధర ఏకంగా రూ.1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.70,200కు చేరింది.

ఇక దేశీయ మార్కెట్లో వెండి ధరలు పెరుగుతుండడంతో.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.75,200కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.75,200 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,200కు ఉండగా.. ముంబైలో రూ.70,200కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర రూ.75,200 దగ్గరగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర తగ్గింది. ఔన్స్‏కు 0.21 శాతం తగ్గుదలతో 27.34 డాలర్లకు తగ్గింది.

Also Read:

Bank Employees Strike: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. యూనియన్ల సమ్మె.. ఆ రెండు రోజులు బ్యాంక్స్ బంద్..