Silver: వెండి ధరలు ఢమాల్.. సగానికి సగం తగ్గనున్న రేట్.. వారికి గొప్ప ఛాన్స్.. ?

గత కొంతకాలంగా వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అయితే మార్కెట్‌లో వెండి మెరుపులు ఒక్కసారిగా మాయం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధరలు.. రాబోయే మూడు నెలల్లో ఊహించని రీతిలో సగానికి పడిపోతాయని నిపుణులు అంటున్నారు.

Silver: వెండి ధరలు ఢమాల్.. సగానికి సగం తగ్గనున్న రేట్.. వారికి గొప్ప ఛాన్స్.. ?
Will Silver Prices Crash By 50 Percent In 3 Months

Updated on: Jan 12, 2026 | 5:21 PM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక కీలక సమయం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే మూడు నెలల్లో వెండి ధరలు ఏకంగా సగానికి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర ఔన్సుకు 80 డాలర్ల స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డాలర్ బలోపేతం కావడం, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం వెండి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో ఔన్సుకు 84 డాలర్ల మార్కును తాకిన వెండి, ఇప్పుడు క్రమంగా దిగివస్తోంది.

40 డాలర్ల మార్కుకు వెండి?

ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు వెండి మార్కెట్‌లో భారీ మార్పులు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. టీడీ సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ గల్లీ, మార్చి వెండి ఫ్యూచర్స్ ధరలను విశ్లేషిస్తూ.. దీర్ఘకాలంలో వెండి ధర రూ.40 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు. మార్చి ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రధాన బ్యాంకులు వెండిపై భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకోవడం గమనార్హం. ధరలు తగ్గడం లక్ష్యంగా ఈ వ్యూహాలను అనుసరిస్తున్నారు.

పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశమా?

వెండి ధరలు భారీగా తగ్గితే, అది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం కావచ్చు. తక్కువ ధరలో వెండిని కొనుగోలు చేసి భవిష్యత్తులో అధిక లాభాలు పొందే వీలుంటుంది. అయితే మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అస్థిరతకు గురవుతున్నందున కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తొందరపడవద్దు

ధరలు తగ్గుతున్నాయని వెంటనే మొత్తం పెట్టుబడి పెట్టకండి. ధర ఇంకా తగ్గే వరకు వేచి చూడటం మంచిది. వెండి ధరలు క్షణక్షణానికి మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ స్థిరపడే వరకు ఆగండి. ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..