Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం బ్రేక్ పడిన వెండి ధరలు.. తాజాగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర 61,600 గా ఉంది. కిలో వెండిపై రూ.700 మేర పెరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,600 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,600 లుగా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 64,900 లుగా ఉంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,600 లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 64,900 గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.64,900 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64,900 గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 64,900గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 64,900 వద్ద కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: