Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. రికార్డు స్థాయి నుంచి రూ. 11 వేల వరకు పతనమైన సిల్వర్‌ రేటు

|

May 06, 2021 | 7:59 AM

Silver Rate Today: దేశీయంగా వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర తాజాగా దిగి వచ్చింది. అయితే వెండి ధర గత సంవత్సరం

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. రికార్డు స్థాయి నుంచి రూ. 11 వేల వరకు పతనమైన సిల్వర్‌ రేటు
Silver Price
Follow us on

Silver Rate Today: దేశీయంగా వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర తాజాగా దిగి వచ్చింది. అయితే వెండి ధర గత సంవత్సరం ఆగస్టు నెలలో కిలోకు రూ. రూ.79,980 స్థాయికి చేరింది. అంటే అప్పటి నుంచి చూస్తే వెండి ధర ఏకంగా రూ.11 వేలు పతనమైంది. ప్రస్తుతం దేశీయంగా చూస్తే వెండి ధర రూ.69,700 వద్ద కదలాడుతోంది. అయితే తాజాగా గురువారం వెండి ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.300 నుంచి 400 వరకు తగ్గగా, హైదరాబాద్‌లో ఏకంగా రూ.1300 వరకు తగ్గముఖం పట్టింది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.69,700 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.67,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, విజయవాడలో రూ.74,000 ఉంది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. రికార్డు స్థాయి నుంచి రూ. 9 వేల వరకు పతనమైన పసిడి రేటు

Fixed Deposit: మీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ అవుతోందా..? ఎఫ్‌డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు..!

Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. అధిక వడ్డీ