
Silver Price Today: ప్రముఖ్యతనిస్తుంటారు. తాజాగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దీంతో వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు శుభవార్తేనని చెప్పాలి. అయితే ధరల్లో హెచ్చతగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలున్నాయి. నిన్న కూడా వెండి ధర భారీగానే తగ్గింది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా… 3 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి కిలో వెండిపై రూ.1600 వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆదివారం దేశీయంగా నమోదైన వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, చెన్నైలో రూ.70,200 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, కోల్‌కతాలో రూ.65,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, కేరళలో రూ.70,200 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200 ఉండగా, విజయవాడలో రూ.70,200 వద్ద కొనసాగుతోంది. ఇక పుణేలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, అహ్మదాబాద్‌లో రూ.65,000 ఉంది.