Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధరల్లో కూడా ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండి పై స్వల్పంగా అంటే రూ.100 నుంచి 150 వరకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం రూ.400 వరకు పెరిగింది. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, బెంగళూరులో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 ఉంది.