Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ ధర..!

Silver Price Today: వెండి ధర పరుగులు పెడుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నా.. కొనుగోళ్లు మాత్రం జోరుగానే..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ ధర..!

Updated on: Nov 28, 2021 | 6:35 AM

Silver Price Today: వెండి ధర పరుగులు పెడుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నా.. కొనుగోళ్లు మాత్రం జోరుగానే సాగుతుంటాయి. దేశంలో మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. తాజాగా ఆదివారం (నవంబర్‌ 28)న దేశంలో కిలో వెండిపై రూ.900 నుంచి రూ.1000 వరకు ఎగబాకింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.62,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కోల్‌కతాలో రూ.62,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,200 ఉండగా, కేరళలో రూ.67,200 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, విజయవాడలో రూ.67,200 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

BSNL Lifetime Plan: కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్‌.. లైఫ్‌టైమ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రద్దు.. మరి ఎలా..?

Two Wheeler: ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే మంచిదా.? కాదా..? నిపుణులు ఏమంటున్నారంటే..!

Recharge Plans: మొబైల్‌ యూజర్లకు షాక్‌.. పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు.. పూర్తి వివరాలు