Silver Rate Today: దేశీయంగా పరుగులు పెడుతున్న పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గతంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమ క్రమంగా పరుగులందుకుంటోంది. తాజాగా శనివారం వెండి ధర భారీగా పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పెరుగుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.1500 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.68,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక పుణెలో కిలో వెండి రూ.68,500 ఉండగా, హైదరాబాద్‌లో రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ఇక ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విశాఖలో రూ.73,400 వద్ద ఉంది.
అయితే దేశీయంగా ధరల్లో మార్పులు, చేర్పులపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.
ఇవీ చదవండి: Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!
Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్… మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు