Today Silver Price: బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతూ వస్తుంటాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఏర్పడుతుంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు కలుగుతుంటాయి. కాగా ఆదివారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర శనివారం 68,900 ఉండగా.. ఆదివారం 68,700లు ఉంది. అంటే 200 రూపాయలు మేర తగ్గింది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,700 లుగా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.68,700 ఉంది.
చెన్నైలో రూ.74,000 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
బెంగళూరులో రూ.68,700 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,700 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం..
ఇదిలాఉంటే.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,660 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.
Also Read: