Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వరుసగా.. రెండు రోజులు పెరిగిన వెండి ధరకు తాజాగా బ్రేక్ పడింది. శనివారం 1400లు పెరిగిన కిలో వెండి ధర.. ఆదివారం తటస్థంగా ఉంది. ఈ రోజూ కూడా వెండి కిలో రూ.65,000 ఉంది. అయితే కొన్ని నగరాల్లో నిన్నటి ధరే ఉండగా.. మరికొన్ని చొట్ల పెరిగింది. ఇంకొన్ని చోట్ల తగ్గింది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000 ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కిలో వెండి రూ.65,000 లుగా ఉంది.
చెన్నైలో ధర రూ.300లు తగ్గి.. రూ.69,700 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో ధర 1,100 లు పెరిగింది. కిలో వెండి ధర రూ.65,900 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో.. కిలో వెండి ధర రూ.300లు తగ్గింది.
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.69,700 లు ఉంది. విజయవాడలో కూడా వెండి రూ.69,700 వద్ద కొనసాగుతోంది.
బంగారం..
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా రెండురోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నిన్నటి ధరలే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.
Also Read: