Silver: భారత్‌ వర్సెస్‌ చైనా.. వెండి ధరలు ఏ దేశంలో తక్కువ? తెలిస్తే షాక్‌ అవ్వడం పక్కా!

వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, పెట్టుబడిదారులకు సంతోషం, కొనుగోలుదారులకు కష్టం. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రపంచ కొరత, చైనా కొత్త ఎగుమతి విధానాలు ధరలను పెంచుతున్నప్పటికీ, భారత్‌లో వెండి చైనా కంటే దాదాపు 17 శాతం తక్కువ కు లభిస్తుంది.

Silver: భారత్‌ వర్సెస్‌ చైనా.. వెండి ధరలు ఏ దేశంలో తక్కువ? తెలిస్తే షాక్‌ అవ్వడం పక్కా!
Silver 3

Updated on: Jan 28, 2026 | 8:00 AM

వెండి ధరలు మార్కెట్‌లో తాండవం చేస్తున్నాయి. గతంలో కలలో కూడా ఊహించని విధంగా సిల్వర్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి రోజు ఒక కొత్త రికార్డు సృష్టిస్తూ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరుగుదల పెట్టుబడిదారులకు సంతోషకరంగా ఉన్నా.. వివాహాల కోసం వెండి కొనవలసి వచ్చిన వారికి కష్టంగా ఉంది. అయితే వెండి ధర పెరుగుదల మధ్య ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. వెండి ధర మన దేశంలో తక్కువగా ఉందా? లేదా మన పొరుగు దేశం చైనాలో తక్కువగా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చైనా కంటే మన దేశంలో వెండి ధరలు తక్కువగా ఉన్నాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ, ఇదే నిజం. చైనా కంటే ఇండియాలో వెండి చౌకగా ఉంది. దాదాపు 17 శాతం ధర తక్కువగా ఇండియాలో వెండి లభిస్తోంది. అంతర్జాతీయంగా వెండి ఔన్సుకు 109 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. 2026లో ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో 250 శాతం పైగా అనూహ్య పెరుగుదల కనిపించింది. చైనాలో వెండి అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముడవుతోంది. ఔన్సు దాదాపు 125 డాలర్లకి చేరుకుంది.

భారత్‌లో వెండి ధర గ్రాముకు దాదాపు రూ.335. 1 ఔన్స్ లేదా దాదాపు 28.3 గ్రాములు భారతదేశంలో ఔన్సు వెండికి రూ.9,984 కు సమానం. అయితే చైనాలో అదే మొత్తంలో వెండి ధర సుమారు రూ.11,450. అందువల్ల భారత్‌, చైనా మధ్య వెండి ధరలలో వ్యత్యాసం సుమారు రూ.2,000. అంటే మన దేశంలో వెండి దాదాపు 17 శాతం తక్కువ ధరకు లభిస్తోంది. అయితే మొత్తంగా వెండి ధరలు ఇలా పెరగడానికి అతిపెద్ద కారణం ప్రపంచ సరఫరా కొరత. అదనంగా చైనా కొత్త విధానం మార్కెట్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. 2026 జనవరి 1 నుండి చైనా వెండి ఎగుమతి పరిమితులను కఠినతరం చేసింది. వెండిని ఎగుమతి చేయడానికి కంపెనీలకు ఇప్పుడు ప్రభుత్వ లైసెన్స్ అవసరం, ఈ నియమం 2027 వరకు అమలులో ఉంటుంది. దీని ఫలితంగా పెద్ద, ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలు మాత్రమే ఎగుమతి చేయగలవు, చిన్న ఎగుమతిదారులు మినహాయించబడవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి