PPF Account: పీపీఎఫ్ అకౌంట్ ఒక్కటే ఉండాలా? నిబంధనలేంటో తెలుసుకోండి..

|

Jun 15, 2023 | 5:30 PM

పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నెలకు నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు కచ్చితంగా ప్రభుత్వ పథకమైన పీపీఎఫ్ వైపు మొగ్గు చూపుతారు. పీపీఎఫ్ పథకం అనేది రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భరోసా ఉంటుందని చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చెల్లిస్తూ ఉంటారు. అలాగే పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ.500 కనిష్ట మొత్తం నుంచి రూ.1,50,000 వరకూ గరిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.

PPF Account: పీపీఎఫ్ అకౌంట్ ఒక్కటే ఉండాలా? నిబంధనలేంటో తెలుసుకోండి..
Ppf Scheme
Follow us on

భారతదేశంలో వేతన జీవులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అధిక జనాభా తగినట్లే వేతన జీవులు కూడా అదే స్థాయిలో ఉంటారు. నెలనెల కష్టపడి సంపాదించిన సొమ్మును కొంతమేర భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టే సొమ్ముకు నమ్మకమైన రాబడితో పాటు పెట్టుబడికి భరోసా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నెలకు నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు కచ్చితంగా ప్రభుత్వ పథకమైన పీపీఎఫ్ వైపు మొగ్గు చూపుతారు. పీపీఎఫ్ పథకం అనేది రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భరోసా ఉంటుందని చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చెల్లిస్తూ ఉంటారు. అలాగే పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ.500 కనిష్ట మొత్తం నుంచి రూ.1,50,000 వరకూ గరిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. అలాగే పోస్టాఫీసులతో పాటు అన్ని బ్యాంకులు పీపీఎఫ్ పథకాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆర్‌బీఐ తీసుకన్న చర్యల కారణంగా అన్ని సంస్థలు పీపీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచాయి. అయితే ఓ వ్యక్తికి ఎన్ని పీపీఎఫ్ అకౌంట్లు ఉండవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా అకౌంట్ల జారీ అనేది సులభతరమైంది. అలాగే ఓ వ్యక్తికి అనేక బ్యాంకుల్లో అకౌంట్లు కూడా ఉంటున్నాయి. అయితే బ్యాంకులకు లింక్ చేస్తూ పీపీఎఫ్ అకౌంట్లు తీసుకోవచ్చా? అంటే అలా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఓ వ్యక్తి ఏ బ్యాంకు ఖాతాతోనైనా ఒకే పీపీఎఫ్ అకౌంట్ ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి పీపీఎఫ్ ఖాతాను తెరిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే సొమ్మను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీరు ఇష్టపడే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పోర్టల్‌కి వెళ్లడం ద్వారా మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా యాక్టివేట్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యాక్టివేట్ చేసినప్పుడు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వ్యక్తి యొక్క గుర్తింపును రుజువు చేసే పత్రాలను అందించాలి. అలాగే పాన్‌కార్డు, నామినీ డిక్లరేషన్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాల్సి ఉంటుంది. 

పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలు

1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ ప్రకారం మొత్తం పీపీఎఫ్ పెట్టుబడి విలువను పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తం రూ.1.5 లక్షలు అని గుర్తుంచుకోవాలి. అదనంగా పీపీఎప్ పెట్టుబడులపై సంపాదించిన మొత్తం వడ్డీ పన్ను గణనకు లోబడి ఉండదు.

ఇవి కూడా చదవండి

పీపీఎఫ్ ఖాతాపై రుణం

మీరు మీ పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన మూడు నుంచి  ఐదు సంవత్సరాల మధ్య రుణాన్ని పొందవచ్చు. లోన్ దరఖాస్తు సంవత్సరానికి ముందు వచ్చిన రెండవ సంవత్సరం మొత్తంలో గరిష్టంగా 25 శాతం రుణం తీసుకోవచ్చు. ఆరో సంవత్సరానికి ముందు, ప్రారంభ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తే రెండో రుణాన్ని కూడా సులభంగా తీసుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి