Ever Given Ship: ఎవర్‌ గివెన్‌కు వెంటాడుతున్న కష్టాలు.. పరిహారం చెల్లిస్తేనే వదిలేస్తామన్న ఈజిప్ట్‌ ప్రభుత్వం..

Ever Given Ship: ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌకకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. సూయజ్ కాలువను ఖాళీ చేసినప్పటికీ ఈజిప్టును విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. సూయజ్ కాలువలో అడ్డంగా

Ever Given Ship: ఎవర్‌ గివెన్‌కు వెంటాడుతున్న కష్టాలు.. పరిహారం చెల్లిస్తేనే వదిలేస్తామన్న ఈజిప్ట్‌ ప్రభుత్వం..
Ever Given Ship

Updated on: Apr 14, 2021 | 7:30 AM

Ever Given Ship: ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌకకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. సూయజ్ కాలువను ఖాళీ చేసినప్పటికీ ఈజిప్టును విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి.. ప్రపంచ నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన ఎవర్ గివెన్ నౌకకు ఈజిప్ట్ న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. నౌక యజమాన్యానికి రూ.100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించే వరకూ వదిలిపెట్టబోమని ఈజిప్ట్ స్పష్టంచేసింది. అయితే ఈ జరిమానాను ఎవర్ గివెన్ యాజమాన్యం చెల్లించేందుకు ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఈ నౌక వల్ల తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని ఈజిప్ట్‌ ప్రభుత్వం వెల్లడించింది. తాము ఖర్చులను మాత్రమే అడుగుతున్నామని.. అసలు నష్టాన్ని కాదంటూ ఈజిప్ట్‌ పేర్కొంది. పరిహారం చెల్లిస్తేనే తమ జలాల నుంచి ఎవర్‌ గివెన్‌ నౌక కదులుతుందని స్పష్టంచేసింది. వారంపాటు నిలవడం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది.

కాగా.. మార్చి 23న సూయజ్‌ కాలువలో రవాణాతో వెళుతోన్న ఎవర్‌ గివెన్‌ నౌక ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఈ ఎవర్‌ గివెన్‌ నౌక విషయమై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆసియా, యూరప్‌ల మధ్య పెద్ద ఎత్తున సరుకులు రవాణా చేసే నౌక కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. నౌకకు సంబంధించిన ఓ భాగం భూమిలో కూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు దాదాపు వారం రోజులు శ్రమించారు. అనంతరం ఈ భారీ నౌక కదిలింది.

అయితే.. కథ సుఖాంతం అయ్యిందని తరుణంలోనే అసలు సమస్య వచ్చి పడింది. నౌక కాలువలో ఇరుక్కు పోవడంతో వాణిజ్య పరంగా తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని ఈజిప్టు ప్రభుత్వం సదరు నౌక యజమానులను బిలియన్‌ డాలర్ల జరిమానాను విధించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్‌ ప్రభుత్వంతో ఎవర్‌ గివెన్‌ యాజమాన్యం చర్చించినప్పటికీ.. మొత్తం చెల్లించాల్సిందేనని వెల్లడించింది. అయితే కాలువ నుంచి గట్టెక్కిన ఎవర్‌ గివెన్‌ నౌకకు కష్టాలు వెంటాడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కెనాల్‌ చీఫ్‌ లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ పేర్కొన్నారు.

Also Read:

Loading...
Unable to load recommendations.
Follow Us