Multibagger Stock: లక్ష పెట్టుబడితో రూ.1.25 కోట్ల లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన మల్టీబ్యాగర్ స్టాక్!!

|

Sep 24, 2022 | 1:07 PM

షేర్ మార్కెట్ అనేది స్నేక్ అండ్ ల్యాడర్ లాంటిది. మీ తెలివికి లక్ తోడైతే.. నిచ్చెనలు ఎక్కి గమ్యాన్ని చేరవచ్చు.. లేదా పాముల నోట్లో పడి దివాలా తీస్తారు.

Multibagger Stock: లక్ష పెట్టుబడితో రూ.1.25 కోట్ల లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన మల్టీబ్యాగర్ స్టాక్!!
Multibagger Stocks
Follow us on

షేర్ మార్కెట్ అనేది స్నేక్ అండ్ ల్యాడర్ లాంటిది. మీ తెలివికి లక్ తోడైతే.. నిచ్చెనలు ఎక్కి గమ్యాన్ని చేరవచ్చు.. లేదా పాముల నోట్లో పడి దివాలా తీస్తారు. ఏదైనా కూడా మన స్టామినాపై ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే.. మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మీరు వినే ఉంటారు. ఈ స్టాక్స్ అనేవి తక్కువ సమయంలో.. ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. మరి అలాంటి స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇక ఇదే అదునుగా చాలామంది షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి రిస్క్‌లకు లోబడి ఉంటాయి. అన్నింటా అవగాహన ఉండి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే.. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. ఇందుకు సరైన ఆప్షన్ మల్టీబ్యాగర్ స్టాక్స్. అలాంటిదే ఒకటి పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

ఈ కంపెనీ స్టాక్స్.. 15 ఏళ్లలో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. అంతేకాదు షేర్ మార్కెట్‌లో అంచలంచలుగా తన వాల్యూ పెంచుకుంటూ చరిత్ర సృష్టించింది. నాడు ఈ కంపెనీ షేర్ వాల్యూ రూ. 300 అయితే.. ఇప్పుడు రూ. 50 వేలు దాటింది. 2007వ సంవత్సరం మార్చి 16వ తేదీన పేజ్ ఇండస్ట్రీస్ షేర్ ధర రూ. 271.80. ఆ తర్వాత ఈ వాల్యూ పెరుగుతూపోయింది. సరిగ్గా ఏడేళ్లకు ఈ షేర్ ధర రూ. 10 వేలు టచ్ అయితే.. మరో మూడేళ్లలో రూ. 20 వేల మార్క్ దాటింది. ఇక 2018లో తొలిసారిగా రూ. 30 వేలు దాటింది. అక్కడ నుంచి కొద్దికాలం పాటు మళ్లీ డౌన్ ఫాల్ చూసింది. అయితే కరోనా టైంలో మరోసారి పుంజుకుంది.

2021వ సంవత్సరం ఆఖరికి రూ. 40 వేల మార్క్ దాటేసింది. ఇక ఇప్పుడు అంటే.. 2022, సెప్టెంబర్ 21కి ఈ షేర్ వాల్యూ రూ. 50,850గా ఉంది. పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ అత్యధిక ధర రూ. 51,600.. అత్యల్ప ధర రూ. 31,565గా ఉంది. కాగా, సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఈ కంపెనీకి సంబంధించిన 100 షేర్లు రూ. 300 చొప్పున కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పుడు వాటి విలువ సుమారు రూ. 50 లక్షలు ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..